జీరో లాంటి భారీ డిజాస్టర్ తర్వాత చాలా గ్యాప్ తీసుకున్న షారుక్ ఖాన్ పఠాన్ అనే సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతున్నాడు. హిందీలో స్పై యాక్షన్ థ్రిల్లర్‌గా తెరకెక్కుతున్న ఈ సినిమాను సిద్ధార్థ్ ఆనంద్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఇక ఈ సినిమాకు ఆదిత్య చోప్రా నిర్మాతగా వ్యవహరిస్తున్నాడు. షారుక్ ఖాన్ సరసన దీపికా పడుకొనే నటిస్తున్న ఈ సినిమాలో జాన్ అబ్రహం మరో కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ చిత్రం జనవరి 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు సిద్ధమవుతోంది.
ఈ సినిమాని కేవలం హిందీలోనే కాకుండా తెలుగు సహా కొన్ని దక్షిణాది భాషల్లో రిలీజ్ చేసేందుకు మేకర్స్ సిద్ధమయ్యారు. యాక్షన్ థ్రిల్లర్ కావడంతో ఐమాక్స్ సహా అన్ని ఫార్మాట్లలో సినిమా రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు.
కానీ హిందీలో చేస్తున్నంత ప్రచారం... తెలుగులో కానీ, తమిళంలో కానీ చేయడం లేదు. వాస్తవానికి బ్రహ్మాస్త్ర సినిమాని తెలుగు సహా తమిళ, మలయాళ, కన్నడ భాషలో రిలీజ్ చేసినప్పుడు.. హీరో రణబీర్ కపూర్, దర్శకుడు అయాన్ ముఖర్జీ ఇద్దరు కలిసి చిత్ర ప్రమోషన్స్‌లో పాల్గొన్నారు.
ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల మీద ఎక్కువ దృష్టి పెట్టడంతో హైదరాబాద్‌లోనే కాకుండా విశాఖపట్నంలో కూడా ఒక ప్రమోషనల్ ఈవెంట్ ఏర్పాటు చేసి మరి సందడి చేశారు. అదేవిధంగా చెన్నై కూడా వెళ్లి తమిళ వెర్షన్‌ను ప్రమోట్ చేసుకున్నారు. కానీ పఠాన్ విషయానికి వస్తే విడుదలకు ఇంకా వారం కూడా లేదు. ఇప్పటికీ తెలుగు సహా తమిళ మార్కెట్‌లో ఎలాంటి సందడి కనిపించడం లేదు.
వాస్తవానికి ఆ టైంకి తెలుగులో పెద్దగా సినిమాల సందడి కూడా లేదు. కరెక్ట్‌గా ప్లాన్ చేసుకుంటే పఠాన్‌కు తెలుగు మార్కెట్ సహా తమిళ మార్కెట్‌లో కూడా వసూళ్ల వర్షం కురిపించే అవకాశం ఉంటుంది.
కానీ పఠాన్ టీం మాత్రం తెలుగు, తమిళ వెర్షన్స్ మీద పెద్దగా దృష్టి పెట్టినట్లు కనిపించడం లేదు. ఇప్పటికే మోడీ ఈ సినిమా మీద పెద్దగా కామెంట్లు చేయవద్దని తమ నేతలకు సూచనలు ఇచ్చిన నేపథ్యంలో పఠాన్ టీం ఇప్పటికైనా బయటకు వచ్చి సౌత్‌లో కూడా ప్రమోషన్స్ చేసుకుంటే చాలా వరకు కలిసి వచ్చే అవకాశం ఉంది.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.