జక్కన్న హీరోలకి రెమ్యునరేషన్ లేదట

Update: 2018-01-19 13:43 GMT
ఈ రోజుల్లో స్టార్ హీరోల సినిమా సెట్స్ పైకి వెళుతోంది అంటే చాలు సినిమా బడ్జెట్ ఏ స్థాయిలో ఉంది అని అందరు అడుగుతుండడం కామన్. ముఖ్యంగా స్టార్లకు డైరెక్టర్ కి ఇచ్చే రెమ్యూనరేషన్ ఎంత అనే విషయంలో క్లారిటీ వచ్చే వరకు డిస్కర్షన్స్ జరుగుతూనే ఉంటాయి. ఇప్పుడు అదే తరహాలో రాజమౌళి మల్టీస్టారర్ పై కూడా అనేక మంది సినీ ప్రముఖులు చర్చలు జరుపుకుంటున్నారు. దీంతో జనాల్లో కూడా ఆ న్యూస్ బాగా వైరల్ అయ్యింది.

మొదట 170 కోట్ల వరకు అని టాక్ గట్టిగానే వచ్చింది. ఆ తరువాత హీరోల రెమ్యునరేషన్ గురించి పలు రకాల కామెంట్స్ వినిపించాయి. ఇక లేటెస్ట్ గాసిప్ విషయానికి వస్తే అసలు స్టార్స్ ఈ సినిమాకు రెమ్యునరేషన్ తీసుకోవడం లేదట. రామ్ చరణ్ - ఎన్టీఆర్ సినిమాల మార్కెట్ దాదాపు 100 కోట్ల వరకు ఉంటుంది. ఇక జక్కన్న మార్కెట్ గురించి స్పెషల్ గా చెప్పనవసరం లేదు. యాక్షన్ అన్నారంటే ఆయన కూడా ఈజీగా సెంచరీ కొట్టగలరని నమ్మవచ్చు. ఇక అసలు విషయనికోస్తే.. ఈ సినిమాకు దర్శకుడు హీరోలు రెమ్యునరేషన్ తీసుకోకుండా సినిమాను చేస్తారట.

అంటే వారికి అవసరం లేదని కాదు. సినిమా బిజినెస్ అయిన తరువాత లబాలను పంచుకోవాలని పర్సంటేజ్ ల ప్రకారం ఒప్పందం కుదుర్చుకోవడానికి ఫిక్స్ అయినట్లు సమాచారం. ప్రస్తుతం అందుకు సంబంధించిన న్యూస్ ఫిల్మ్ నగర్ లో హాట్ టాపిక్ గా మారింది. ఇక సినిమా బడ్జెట్ విషయానికి వస్తే జక్కన్న చెప్పినట్టుగానే ఎలాంటి విజువల్ ఎఫెక్ట్స్ లేకుండా యాక్షన్ అండ్ హార్ట్ టచింగ్ సెంటిమెంట్ తో తెరకెక్కించాలని ప్లాన్ చేస్తున్నాడు. అందుకు తగ్గట్టుగా కథ కూడా సెట్ అయ్యింది. ప్రస్తుతం ఫుల్ స్క్రిప్ట్ వర్క్స్ జరుగుతున్నాయి. రాజమౌళి మొత్తానికి ఓ మీడియం బడ్జెట్ లోనే మల్టీస్టారర్ ని తెరకెక్కించాలని అనుకుంటున్నాడు. మరి ఆ ప్లాన్స్ ఎంతవరకు వర్కౌట్ అవుతాయో చూడాలి.
Tags:    

Similar News