సైకో వర్మకు సెన్సార్‌ క్లియరెన్స్‌ లేదట

Update: 2021-07-29 13:30 GMT
వివాదాల దర్శకుడు రామ్‌ గోపాల్ వర్మ మాత్రమే కాకుండా ఆయన పేరు కూడా వివాదాస్పదం అవుతుంది. గతంలో వర్మ పేరుతో.. ఆయనపై అన్నట్లుగా కొన్ని సినిమాలు వచ్చాయి. తాజాగా నట్టి కుమార్ దర్శకత్వంలో 'సైకో వర్మ' అనే సినిమా పట్టాలెక్కింది. షూటింగ్‌ పూర్తి చేసుకున్న ఈ సినిమా ను సెన్సార్‌ ముందుకు తీసుకు వెళ్లారు. చిత్ర యూనిట్‌ సభ్యులు మొదట టైటిల్ మార్చితేనే సెన్సార్‌ కు అంగీకరిస్తామంటూ సెన్సార్‌ బోర్డ్‌ అధికారులు తేల్చి చెప్పారట. సైకో వర్మ టైటిల్‌ నుండి సైకో పదంను తొలగించాలని.. లేదా మరేదైనా టైటిల్ తో రావాలంటూ సూచించారట.

ఈ విషయమై నట్టి కుమార్ తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశాడు. గతంలో సైకో అనే పదం ఉపయోగించి ఎన్నో సినిమాలు వచ్చాయి. కాని ఇప్పుడు ఎందుకు సైకో పదంతో టైటిల్‌ ను అనుమతించడం లేదు అంటూ ప్రశ్నించాడు. సెన్సార్‌ బోర్డు ద్వంద విధానం అవలంభిస్తుందని.. కొందరికి ఒకలా.. మరి కొందరికి మరోలా తమ విధానంను మార్చుతున్నట్లుగా నట్టి కుమార్‌ అసంతృప్తిని వ్యక్తం చేశాడు. నట్టి కుమార్‌ స్వీయ నిర్మాణంలో రూపొందిన ఈ సినిమా సెన్సార్‌ సమస్య తలెత్తడంతో విడుదల విషయమై సస్పెన్స్ నెలకొంది.

గతంలో సైకో అనే పదంతో సినిమాలు వచ్చాయి. కనుక ఆ విషయాన్ని మేము కోర్టు దృష్టికి తీసుకు వెళ్లి సెన్సార్‌ తీసుకు వస్తామని నట్టి కుమార్‌ అంటున్నారు. ఆయన కు ఇండస్ట్రీ లో కొందరు మద్దతుగా ఉన్నారు. గతంలో లేని రూలును ఇప్పుడు సైకో వర్మ సినిమాకు ఎందుకు పెడుతున్నారు అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు. నట్టి కుమార్‌ కోర్టుకు వెళ్తే జరిగేది ఏంటో అనేది ఇండస్ట్రీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. కథకు తగ్గట్లుగా అనుకున్న టైటిల్‌ ను మాత్రం నట్టి కుమార్ మార్చేది లేదు అంటూ భీష్మించుకు కూర్చున్నాడు.
Tags:    

Similar News