వెంకీ క్యామియో ఎందుకు?

Update: 2018-01-17 15:30 GMT
భారీ అంచనాల మధ్య పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో నటించిన మూడవ చిత్రం గా తెరకెక్కింది అజ్ఞాతవాసి. విడుదల కు ముందే ఎంతో హైప్ తెచ్చినప్పటికి సినిమా ప్రేక్షకులను అలరించలేకపోయింది. చాలా మంది త్రివిక్రమ్ నుండి ఇలాంటి సినిమా ను అసలు ఊహింహనేలేదని అన్ని సన్నివేశాలు కూడా నిరుత్సాహ పరిచేలా ఉన్నాయ్ అని కామెంట్స్ చేస్తున్నారు.

సినిమాలో మరిన్ని తప్పులు ఎక్కడ జరిగి ఉండచ్చో వెతకగా ఎడిటింగ్ టేబుల్ వద్దనే ఎదో జరిగి ఉండవచ్చు అనే మాటలు వినిపిస్తున్నాయి. సినిమా వల్ల బయ్యర్లు నష్టపోతున్నారు అని బాధతో వారిని కాపాడేందుకు సినిమాలో ముందు తొలగించిన ఒక ఫుటేజ్ ను సినిమాకు యాడ్ చేశారు. ఇందులో విక్టరీ వెంకటేష్ నటించిన ఒక చిన్న సన్నివేశం కూడా ఉండటం విశేషం. కానీ సినిమా కలెక్షన్స్ పెరగకపోగా అసలు వెంకీ కారెక్టర్ ను సినిమాలో ఎందుకు పెట్టారో అర్థంకాక ప్రేక్షకులు తలలు పట్టుకుంటుకున్నారు. వెంకీ వల్ల ఎటువంటి నవ్వులు రాకపోగా అటు పవన్ ఫాన్స్ మరియు వెంకీ ఫాన్స్ కూడా ఆగ్రహం వ్యక్తంచేశారు. త్రివిక్రమ్ ఒక్క సన్నివేశాన్ని కూడా బాగా తియ్యలేదని అసలు త్రివిక్రమ్ దర్శకత్వమే చేసి ఉండడని కామెంట్స్ వేస్తూన్నారు జనాలు.

టాలెంట్ ఉన్న తారాగణం, అడ్డు చెప్పని ప్రొడ్యూసర్లు - విడుదలకు ముందే బోలెడంత హైప్. సినిమాకు లేనిది అంటూ ఏది లేదు. కానీ ఇన్ని ఉన్నా ప్రేక్షకులకు నచ్చేలా సినిమాను తియ్యలేకపోయాడు మన మాటల మాంత్రికుడు త్రివిక్రమ్. వెంకీ క్యామియో వల్ల సినిమా కి ఒరిగింది అంటూ ఏమి లేకపోగా త్రివిక్రమ్ పైన విమర్శలు మాత్రం ఒకరకంగా పెరిగాయి అనే చెప్పవచ్చు.
Tags:    

Similar News