గత ఏడాది మూడున్నరేళ్ల జైలు జీవితం ముగించుకుని బయటి ప్రపంచంలోకి అడుగుపెట్టాడు సంజయ్ దత్. ఇక అతడి జీవితంలో చీకటి రోజులకు తెరపడినట్లే అని.. ఇక అతడి జీవితం సాఫీగా సాగిపోతుందని ఆశించారు అభిమానులు. కానీ సంజూ భాయ్ కష్టాలకు ఇంతటితో తెరపడేలా లేదు. ఓ పాత కేసు అతడిని మళ్లీ కష్టాల్లోకి నెట్టేలా కనిపిస్తోంది. షకీల్ నూరాని అనే నిర్మాత 2013లో పెట్టిన కేసుకు సంబంధించి కోర్టు ఆదేశాలు బేఖాతరు చేసినందుకు.. తమ ముందు హాజరు కానందుకు సంజయ్ దత్ కు అరెస్ట్ వారెంట్ జారీ అయింది. ముంబయిలోని స్థానిక కోర్టు ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది.
సంజయ్ దత్ హీరోగా చాలా ఏళ్ల కిందట ‘జాన్ కి బాజి’ అనే సినిమా మొదలుపెట్టాలనుకున్నాడు షకీల్ నూరాని. ఇందుకోసం సంజూకి రూ.50 లక్షల అడ్వాన్స్ కూడా ఇచ్చాడట. కానీ సంజూ ఈ సినిమా చేయలేదు. అడ్వాన్స్ తిరిగివ్వమంటే ఇవ్వలేదట. పైగా మాఫియా వాళ్ల ద్వారా షకీల్ ను బెదిరించాడట. దీంతో సంజయ్ మీద కేసు పెట్టాడతను. అడ్వాన్స్ తీసుకుని దశాబ్దంన్నర దాటుతోందని.. తనకు అడ్వాన్స్ రూ.50 లక్షలతో పాటు నష్టపరిహారం కింద మరో రూ.2 కోట్లు ఇవ్వాలని అతను డిమాండ్ చేస్తున్నాడు. ఈ కేసు విచారణకు హాజరు కావాలని పలుమార్లు సంజయ్ కు నోటీసులిచ్చినా.. అతను పట్టించుకోకపోవడంతో అరెస్ట్ వారెంట్ ఇష్యూ చేసే వరకు పరిస్థితి వెళ్లింది. మరి ఈ కేసు నుంచి సంజయ్ దత్ ఎలా బయటపడతాడో చూడాలి.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/