ఐటెమ్‌ భామ టెంపర్‌ పెంచేస్తోంది

Update: 2015-06-27 06:40 GMT
టాలీవుడ్‌కి బోలెడుమంది ఐటెమ్‌ భామల్ని పరిచయం చేశాడు పూరి జగన్నాథ్‌. ముమైత్‌ఖాన్‌, గాబ్రియెలా బెట్రాంటే, స్కార్లెట్‌ విల్సన్‌, శ్వేత భరద్వాజ్‌, నోరా ఫతేహి వంటి భామల్ని పరిచయం చేశాడు. అయితే వీళ్లలో ముమైత్‌ఖాన్‌ దశాబ్ధం పైగానే టాలీవుడ్‌ని ఏలింది. ఆ తర్వాత అంత మేలేజ్‌ ఉన్న వేరే ఐటెమ్‌ భామ ఎవరూ లేరు.

అయితే ఇటీవలి కాలంలో టెంపర్‌ సినిమాతో పరిచయమైన నోరా పతేహి మాత్రం రేస్‌లో దూసుకుపోతోంది. ఈ భామ టెంపర్‌తో ఎన్టీఆర్‌ అభిమానులకు కిక్కిచ్చింది. ఆ ఐటెమ్‌కి పెద్ద స్థాయిలో రెస్పాన్స్‌ వచ్చింది. అందుకే ఈ మోరాకో బ్యూటీని పిలిచి మరీ మనవాళ్లు అవకాశం ఇస్తున్నారు. ఇప్పటికిప్పుడు రవితేజ సినిమాలో, బాహుబలిలో మనోహరి సాంగ్‌ చేసేసింది. ఇప్పుడిక కళ్యాణ్‌రామ్‌ షేర్‌లో ఐటెమ్‌ నంబర్‌ చేస్తోంది. నోరా తొలుత బాలీవుడ్‌లో ఆరంగేట్రం చేసింది. రోర్‌ : ది టైగర్స్‌ ఆఫ్‌ సుందర్‌బన్‌ (2013) చిత్రంతో ఉత్తరాదికి పరిచయమైంది. ఆ తర్వాత అక్కడ కెరీర్‌ వెలగకపోయినా దక్షిణాది పిలిచి అవకాశాలిస్తోంది. ఇదంతా పూరీ పుణ్యమే. టాలీవుడ్‌ని ఓ ఐదేళ్ల పాటైనే ఏలేట్టే కనిపిస్తోంది ఈ భామ.

Tags:    

Similar News