తెలుగు హీరోల పాన్ ఇండియా స్టార్ డమ్ చూస్తుంటే నార్త్ స్టార్లు జెలస్ ఫీలవుతున్నారా? అంటే అవుననే పలు సన్నివేశాలు నిరూపిస్తున్నాయి. ఇటీవలి కాలంలో ముంబై మీడియాలో ఎక్కువగా వినిపిస్తున్న ప్రశ్న కూడా ఇదే. ఉత్తరాది మీడియా నార్త్ హీరోల వెంట పడి మరీ ఈ తరహా ప్రశ్నలతో విసిగించడం కనిపిస్తోంది.
ఓ ఇంటర్వ్యూలో ఖిలాడీ అక్షయ్ కుమార్ కి ఇలాంటి సన్నివేశం ఎదురైంది. దక్షిణాది స్టార్లు వేగంగా దూసుకొస్తున్నారు. దక్షిణాది సినిమా పెద్ద సక్సెసవుతోంది ఉత్తరాదిన. ఈ పరిణామాన్ని మీరు ఎలా చూస్తారు? అంటూ.. పుష్ప ని పెద్ద ఎగ్జాంపుల్ గా చూపిస్తుంటే కాస్త అసహనానికి గుర్యాడు అక్కీ. నిజమే అని ఒప్పుకుంటూ కూడా ఈ ప్రశ్న వస్తుందని అతడు ఊహించలేకపోయాడు. ఉత్తరాదిన రెగ్యులర్ గా వస్తున్న కంటెంట్ కి విభిన్నంగా దక్షిణాది సినిమా కంటెంట్ ఉంటోంది. పైగా ఫక్తు మాస్ మసాలా యాక్షన్ కంటెంట్ కి ఉత్తరాది మాస్ బ్రహ్మరథం పడుతోంది. సాహో - పుష్ప ది రైజ్ విజయాల్లో ఇది కీలక భూమిక పోషించింది.
అయితే దక్షిణాది మీడియాలో కొన్ని డౌట్లు కూడా పుట్టుకొస్తున్నాయి. అసలు నార్త్ మీడియా నార్త్ సినిమా సౌత్ కంటెంట్ ని కేవలం డబ్బు కోసమే ప్రమోట్ చేస్తున్నాయా? వాళ్లు మన కంటెంట్ విషయంలో స్టార్ల విషయంలో జెలస్ ఫీలవుతున్నారా? బాగా ఆలోచిస్తే.. సౌత్ స్టార్లకు అక్కడ విపరీతమైన ఆదరణ దక్కడం వెనక మాస్ యాక్షన్ ప్రధాన కారణమవుతోందా? అన్నది ఆలోచించాలి. అయితే రొటీనిటీకి భిన్నంగా వైవిధ్యమైన కంటెంట్ తో సౌత్ సినిమాలు వస్తున్నాయన్నది కూడా మర్చిపోకూడదు.
రంగస్థలం - పుష్ప లాంటి చిత్రాలు పూర్తిగా విభిన్నమైన కంటెంట్ తో వచ్చినవి. ఇలాంటివి ఉత్తరాది ఆడియెన్ కి నచ్చుతున్నాయి ఇటీవలి కాలంలో. జెర్సీ లాంటి క్లాస్ సినిమాని కూడా హిందీలో రీమేక్ చేస్తున్నారంటే అది కంటెంట్ పరంగా వైవిధ్యం ఆకర్షించడం వల్లనే. ఇక చాలా వరకూ నార్త్ సినిమాల్లో లవ్ స్టోరీలు దేశభక్తి నేపథ్యం ఉన్నవే వస్తున్నాయి. ఇలాంటి రకరకాల కారణాలతో తెలుగు యాక్షన్ సినిమాలకు హిందీ బయ్యర్లు భారీ మొత్తాల్ని వెచ్చిస్తున్నారు. అందుకు తగ్గట్టు అక్కడ తెలుగు సినిమాల నుంచి భారీగానే ఆర్జిస్తున్నారు. డిమాండ్ ని బట్టే కొనుగోళ్లు సాగుతున్నాయి.