సీఎం భరత్ తో దేవరకొండకు పోలికలు షురూ

Update: 2018-09-06 05:51 GMT
ప్రపంచమంతా పోలికలతో సాగుతుంది. అది మనం కాదు థియరీ ఆఫ్ రిలేటివిటీ అంటూ మామూలు జనాలకు అర్థం కాని భౌతిక శాస్త్రం కాన్సెప్ట్ ను కనుక్కున్న ఐన్ స్టీన్ చెప్పిన మాట.  ఎవిరిథింగ్ ఈజ్ రిలేటివ్.  మహేష్ బాబు సినిమా 'భరత్ అనే నేను' రిలీజ్ అయినప్పుడు చాలామంది రానా 'లీడర్' తో పోల్చారు.. పోలిక సరికాదన్నవారు కూడా ఉన్నారు. రెండూ పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిన సినిమాలు కావడం - హీరోలు రెండో సినిమాలలో ముఖ్యమంత్రి పాత్ర పోషించడంతో అలా జరిగింది.  తాజాగా విజయ్ దేవరకొండను మహేష్ బాబు తో పోలుస్తున్నారు.

ఎందుకంటారా? విజయ్ తాజా చిత్రం 'నోటా' ట్రైలర్ ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రిలీజ్ కానుంది. దానికి శాంపిల్ గా 'స్నీక్ పీక్' అంటూ టీజర్ లాంటి  హాఫ్ మినిట్ వీడియోను నిన్న రిలీజ్ చేసింది 'నోటా' టీమ్.  అందులో రౌడీ అవతారం తో పాటుగా రాజకీయనాయకుడి అవతారం.. ఆ తర్వాత ది లీడర్ అంటూ అసలు సిసలైన నాయకుడి అవతారంలో కనిపించాడు విజయ్ దేవరకొండ.  మరి ఈ సినిమాలో ముఖ్యమంత్రి గా నటిస్తున్నాడా లేదా అనే విషయం లో ఇంకా క్లారిటీ లేదుగానీ సోషల్ మీడియా లో ఇప్పటికే మహేష్ - విజయ్ లను పోలుస్తున్నారు నెటిజనులు.  

ఎవరు రాజకీయ నాయకుడి పాత్రలో బాగున్నారు అనే టాపిక్ నుండి మొదలు పెడితే..  రానా ను - మహేష్ బాబు ను విజయ్ దేవరకొండ మరిపిస్తాడా అనే టాపిక్ వరకూ ఆ చర్చలు సాగుతున్నాయి. మరి ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత పరిస్థితి  ఎలా ఉంటుందో? 
Tags:    

Similar News