రాజమౌళి దర్శకత్వంలో రూపొందిన 'ఆర్ ఆర్ ఆర్' కోసం అభిమానులంతా ఎంతో ఆసక్తితో ఎదురుచూస్తున్నారు. ఎన్టీఆర్ - చరణ్ ప్రధానమైన పాత్రలను పోషించిన ఈ సినిమాపై ఒక రేంజ్ లో అంచనాలు ఉన్నాయి. కొమరం భీమ్ గా ఎన్టీఆర్, అల్లూరి సీతారామరాజుగా చరణ్ పవర్ఫుల్ రోల్స్ లో కనిపించనున్నారు.
భారీ బడ్జెట్ తో డీవీవీ దానయ్య నిర్మించిన ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్స్ తో పాటు హాలీవుడ్ ఆర్టిస్టులు కూడా నటించారు. రాజమౌళి .. ఎన్టీఆర్ .. చరణ్ .. సుడిగాలి పర్యాటనలా ప్రమోషన్స్ లో పాల్గొన్న విషయం తెలిసిందే.
అంతేకాకుండా వేరు వేరుగా కూడా వాళ్లు కొన్ని ఇంటర్వ్యూలు ఇచ్చారు. జొమాటో సీనియర్ మార్కెటింగ్ అసోసియేట్ సాహిబా, తన యూ ట్యూబ్ ఛానల్ ద్వారా ఫుడ్ కి సంబంధించిన అంశాలను ప్రధానంగా తీసుకుని సెలబ్రిటీలను ఇంటర్వ్యూలు చేస్తుంటారు.
'ఆర్ ఆర్ ఆర్' సినిమాకి సంబంధించి ఇటీవల చరణ్ ఇంటర్వ్యూ తీసుకున్నారు. అలాగే ఆ తరువాత ఎన్టీఆర్ వారికి ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ షోలో ఎన్టీఆర్ చాలా యాక్టివ్ గా కనిపిస్తూ సరదాగా సమాధానాలిస్తూ సందడి చేశాడు. ఆయన అనర్గళంగా 5 భాషల్లో మాట్లాడుతుండటం పట్ల సాహిబా ప్రశంసలు కురిపించారు.
సాహిబా అడిగిన ప్రశ్నలకి ఎన్టీఆర్ సమాధానాలిస్తూ .. రెండు పవర్ఫుల్ పాత్రల కలయికగా 'ఆర్ ఆర్ ఆర్' కనిపిస్తుందని చెప్పాడు. 'ఆర్ ఆర్ ఆర్' టీమ్ లో ఎవరెవరికి ఎలాంటి ఫుడ్ ఆర్డర్ చేస్తారని అడిగితే, రాజమౌళికి హైదరాబాద్ బిర్యానీ .. అలియాకి ఇరానీ బన్ మస్క్ .. అజయ్ దేవగణ్ కి ముంబై ఫేమస్ వడ పౌ .. చరణ్ కి పానీ పూరి ఆర్డర్ చేస్తానని ఎన్టీఆర్ చెప్పాడు.
చరణ్ చాలా సెన్సిటివ్ అనీ .. పానీ పూరి నోట్లో వేసుకోగానే దాని ఫ్లేవర్స్ అన్నీ వెంటనే తెలిసినట్టుగా, చరణ్ ను కలవగానే ఆయన స్వభావం ఏమిటనేది తెలిసిపోతుందని అన్నాడు.
ఇక బిర్యాని చూడటానికి చాలా బాగుటుంది .. తినడానికి చాలా రుచిగా ఉంటుంది. కానీ చేయడం మాత్రం చాలా కష్టమైన విషయం. ఒక సినిమా తయారీలో రాజమౌళి గారు అంతగా కష్టపడతారు. హైదరాబాద్ బిర్యాని మాదిరిగా పెర్ఫెక్ట్ గా ఉండేవారినే ఆయన ఎక్కువగా ఇష్టపడతారు అని చెప్పుకొచ్చాడు.
ముందుగా సాహిబాకి హైదరాబాద్ బిర్యానీని రుచి చూపించిన ఎన్టీఆర్, ఆ తరువాత ఆమెకి తెలంగాణ చేపల పులుసు .. గుంటూరు చికెన్ సర్వ్ చేశాడు. ఇప్పుడు యూ ట్యూబ్ లో ఈ ఇంటర్వ్యూకి మంచి రెస్పాన్స్ వస్తోంది.