హీరోలు వేళ్ళెట్టకపోతే బెటర్‌

Update: 2015-04-10 11:30 GMT
మొన్న జూనియర్‌ ఎన్టీఆర్‌ టెంపర్‌తో.. ఇప్పుడు బన్నీ సన్‌ ఆఫ్‌ సత్యమూర్తితో.. ఒక విషయాన్ని ప్రూవ్‌ చేశారు. ఎంతైనా కాస్ట్యూమ్స్‌ విషయాన్ని స్టయిలిస్టులకు వదిలేస్తే బెటర్‌. దానితోపాటు తక్కిన స్టయిలింగ్‌ మీద కూడా హీరోలే ఫోకస్‌ చేస్తుంటే, దాని రిజల్ట్‌ పెద్దగా కిక్కివ్వట్లేదు.

టెంపర్‌ సినిమాలో ఎన్టీఆర్‌ డ్రస్సులు కాని.. సన్‌ ఆఫ్‌సత్యమూర్తిలో బన్నీ డ్రస్సులు కాని పెద్ద గొప్పగా ఏం లేవు. కాస్ట్‌లీగా కనిపించవచ్చు కాని.. హీరోల బాడీ లాంగ్వేజ్‌కు మ్యాచ్‌ అయ్యి, సదరు క్యారక్టర్‌కు తగ్గట్లు అనిపించలేదు. దానికి కారణం ఏంటంటే.. మనోళ్లు సొంతంగా తమ డ్రస్సులను తామే కొనుక్కోవడమే. టెంపర్‌ కోసం ఎన్టీఆర్‌ హాంకాంగ్‌లో షాపింగ్‌ చేస్తే, బన్నీ బాబు దుబాయ్‌లో షాపింగ్‌ చేశాడు. వీళ్ళు కొన్న బట్టలన్నీ ఏదో పాటల్లో అలా అలా డ్యాన్సులు చేయడానికి బాగున్నాయి కాని, సినిమాలో రెగ్యులర్‌గా వాడటానికి సింక్‌ అవ్వలేదు. ముఖ్యంగా బన్నీ కాస్ట్యూమ్స్‌ మరీ టూ మచ్‌. తన క్యారక్టర్‌కు సరైన స్టయిలింగే లేదు.

ఇక మీదటైనా మనోళ్ళ స్టయిలింగ్‌ను స్టయిలిష్టులకే ఇచ్చేస్తే బెటర్‌ ఏమో. అంతేకాకుండా మేమే బట్టలు కొనుక్కొస్తాం అంటే మాత్రం అవి మిస్‌మ్యాచ్‌ అయ్యే ఛాన్సుంది.
Tags:    

Similar News