ఎన్టీఆర్-హరికృష్ణ.. రెండు కళ్లూ చాల్లేదు

Update: 2016-10-06 07:30 GMT
నందమూరి కుటుంబంలో రిలేషన్స్ కొంచెం చిత్రంగా అనిపిస్తుంటాయి. జూనియర్ ఎన్టీఆర్ విషయంలో జరిగిన పరిణామాలు అందరికీ తెలిసినవే. ఒకప్పుడు తారక్.. అతడి అన్నయ్య కళ్యాణ్ రామ్ మధ్య అంత మంచి సంబంధాలుండేవి కావు. కానీ ఈ మధ్య ఇద్దరూ చాలా క్లోజ్ గా ఉంటున్నారు. గతంలో తారక్.. హరికృష్ణ మధ్య కూడా అంత సాన్నిహిత్యం కనిపించేది కాదు. ఇద్దరం కలవడం తక్కువుండేది. కానీ గత కొన్నేళ్లలో పరిస్థితి మారింది. ఎన్టీఆర్ సినిమాల ఆడియో వేడుకల్లో హరికృష్ణ కనిపిస్తున్నాడు. తాజాగా కళ్యాణ్ రామ్ ‘ఇజం’ ఆడియో వేడుకలో ఎన్టీఆర్-హరికృష్ణ జోడీ అందరి దృష్టినీ ఆకర్షించింది.

తండ్రిని ఈ మధ్య కలిసి చాలా కాలమైందో ఏంటో.. ఆడిటోరియంలోకి వచ్చి తండ్రిని చూడగానే చాలా ఎగ్జైట్ అయిపోయాడు తారక్. తండ్రిని హత్తుకుని ఆయన్ని సోఫాలో కూర్చోబెట్టి.. ఆయన ముందు కింద మోకాళ్లపై కూర్చుని.. ఆయన చేతులు పట్టుకుని చాలా ఆప్యాయంగా మాట్లాడాడు తారక్. ఆశ్చర్యకరమైన విషయం ఏంటంటే.. హరికృష్ణతో కాస్త అంటీ ముట్టనట్లు కనిపించే అతడి సోదరుడు రామకృష్ణ ఈ వేడుకకు వచ్చాడు. ఆయనతోనూ ఎన్టీఆర్ చాలా ఆప్యాయంగా మాట్లాడాడు. ఇద్దరి మధ్యన హరికృష్ణ కూర్చుని సంధానకర్త లాగా వ్యవహరించాడు. తండ్రితో చాలా సేపు నవ్వుతూ చాలా మాట్లాడాడు తారక్. ఇదంతా చూడ్డానికి నందమూరి హీరోలకు రెండు కళ్లూ సరిపోలేదు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News