పిక్ టాక్‌ : అమెరికాలోని మన వంటశాలలో ఎన్టీఆర్‌

Update: 2022-12-26 07:04 GMT
యంగ్‌ టైగర్ ఎన్టీఆర్ ప్రస్తుతం ఫ్యామిలీతో కలిసి అమెరికా పర్యటనలో ఉన్న విషయం తెల్సిందే. ఆర్ఆర్ఆర్‌ సినిమా కోసం నెలల తరబడి షూటింగ్‌.. ఆ తర్వాత ప్రమోషన్ కార్యక్రమాలతో అలసి పోయిన ఎన్టీఆర్ గత కొన్ని నెలలుగా పూర్తి విశ్రాంతి లో ఉన్నాడు. తదుపరి సినిమా కొరటాల శివ దర్శకత్వంలో అంటూ కన్ఫర్మ్‌ అయినా కూడా ఇప్పటి వరకు షూటింగ్‌ మొదలు అవ్వలేదు.

గత కొన్ని రోజులుగా అమెరికాలో భార్య మరియు పిల్లలతో సరదాగా క్వాలిటీ టైమ్‌ ను స్పెండ్ చేస్తున్న ఎన్టీఆర్‌ ఇన్ స్టా గ్రామ్‌ లో షేర్ చేసిన ఫోటో అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. అది ప్రమోషన్ పోస్ట్‌ అయ్యి ఉంటుందని కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఎన్టీఆర్ కు నచ్చి పోస్ట్‌ చేసి ఉండవచ్చు అంటున్నారు.

పూర్తి వివరాల్లోకి వెళ్తే.. అమెరికాలోని న్యూ జెర్సీ లో ఉన్న మన ఇండియన్ రెస్టారెంట్‌ కు ఎన్టీఆర్ వెళ్లాడు. అక్కడ ఫుడ్ ను ఆస్వాదించాను అంటూ సోషల్‌ మీడియా ద్వారా చెప్పుకొచ్చాడు. విదేశీ పర్యటనలో ఉన్న ఇండియన్స్ కు ఇంత కంటే బెస్ట్‌ ఇండియన్ ఫుడ్‌ ఎక్కడ లభించదు అన్నట్లుగా కామెంట్స్ చేశాడు.

జునూన్‌ అనే ఆ రెస్టారెంట్‌ లో ఆహారం చాలా అద్భుతంగా ఉంది అన్నట్లుగా ఎన్టీఆర్‌ ప్రశంసించాడు. అంతే కాకుండా అక్కడి వారితో వంటశాలలో ఫొటో దిగి ఇన్ స్టా లో షేర్ చేశాడు. ఎన్టీఆర్‌ ఇన్ స్టా పోస్ట్‌ లు చాలా తక్కువగా ఉంటాయి. ఆయన ఏం షేర్ చేసినా కూడా వైరల్‌ అవుతూ ఉంటుంది.

ఇక ఫొటోలో ఎన్టీఆర్ లుక్ గురించి కూడా చర్చ జరుగుతోంది. ఎన్టీఆర్ యొక్క గడ్డం మరియు మీసాలాతో పాటు ఆయన డ్రస్సింగ్‌ స్టైల్‌ చాలా బాగుంది అంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి అభిమానులతో పాటు ప్రతి ఒక్కరు కూడా ఈ ఫొటోను ఒక లుక్కేస్తున్నారు. 




నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.
Tags:    

Similar News