ఓరి బిగ్ బాస్ ఏషాలో!!!

Update: 2017-07-29 07:03 GMT
రోజురోజుకీ బిగ్ బాస్ కార్యక్రమం బాగా ఆసక్తికరంగా మారిపోతోంది. అందుకే అర్బన్ ఏరియాస్ లో వారాంతం ఎన్టీఆర్ వచ్చిన షో కు 16 టిఆర్పీ వస్తే.. వారం మధ్యలో కూడా 15 వరకు టిఆర్పీ వచ్చింది. ఇప్పుడు ఆ టిఆర్పీని ఇంకా పెంచేందుకు.. మనోళ్ళు బిగ్ బాస్ కంటెస్టంట్లతో మామూలు ఫీట్లు చేయించట్లేదు అనుకోండి. అదిగో మొన్న ఒక ఎపిసోడ్ లో వీళ్ళతో ఒక డ్రామా వేయించారు. వామ్మో ఆ డ్రామా చూస్తే ఓరీళ్ళ ఏషాలో అని అనుకోవాల్సిందే ఎవరైనా కూడా.

శివగామిగా సింగర్ కల్పన - నవాబుగా ఆదర్శ్ - కాలకేయగా ప్రిన్స్ - కట్టప్పగా కత్తి మహేశ్ - కిల్‌ బిల్ పాండేగా సమీర్ - డాక్టర్ బాలీగా ధన్‌ రాజ్ - శృంగార తారగా హరితేజ నటించాలి అని బిగ్‌ బాస్ ఆదేశించారు. బాగా నటించిన వారికి ఉత్తమ నటీనటుల అవార్డులను అందజేస్తాం అని ప్రకటించారు. దానితో అందరూ ఆ పాత్రలకు తగిన వేషధారణ వేసుకుని (ఏదో సరదాకి దసరా వేషాలు వేశారులే) ఇరగదీశారు. ఇందులో శివగామి మెడలో నుండి మహేష్‌ కత్తి ఒక చైన్ దొబ్బేయడం.. అడ్డొచ్చిన సైనికుడు శివ బాలాజీకి అందులో వాటా ఆఫర్ చేయడం.. నవ్వులు పండించాయిలే. అయితే ఈ మొత్తం ఎపిసోడ్ లో శివగామిగా సింగర్ కల్పన ఇరగదీసింది. 'నా మాటే శాసనం' అంటూ చితక్కొట్టేసింది. అందుకే ఆమెకు ఉత్తమ నటి ట్రోఫీ ఇచ్చారు. అలాగే నవాబుగా ఆదర్శ్ కూడా ఇరగదీశాడు. అతన్ని బెస్ట్ యాక్టర్ అనేశారు.

మొత్తానికి బిగ్ బాస్ తెలుగు వర్షన్ ను చాలా రసవత్తరంగానే నడుపుతున్నారండోయ్. అందుకే ఇప్పుడు ఈ షోను చూసేవారు పెరుగుతున్నారు. కాకపోతే షో నడుస్తున్న కొద్దీ చాలామంది కంటెస్టంట్లు టాలెంట్ చూపించేస్తున్నారు కాబట్టి.. వీరిలో ఎవరు గెలుస్తారో చివరకు అనేదే చూడాల్సిన అంశం.
Tags:    

Similar News