ఒంట్లో బాగులేకున్నా ''ఓటుకు ప్రేమతో''

Update: 2016-02-02 09:25 GMT
గ్రేటర్‌ ఎన్నికల్లో అనేక మంది ప్రముఖులు తమ ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటు వేసిన ప్రతి సెలబ్రిటీ ఓటింగ్‌ శాతం పెంచేందుకు ప్రతి ఒక్కరూ ఓటు వేయాలంటూ ఓటర్లకు విజ్ఞప్తి చేస్తున్నారు. ప్రజలకు ఓటు ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. జూబ్లీ హిల్స్‌ ఓబుల్‌ రెడ్డి స్కూల్లో జూనియర్‌ ఎన్టీఆర్‌ ఓటు హక్కు వినియోగించుకున్నారు. అనంతంర ఆయన మీడియాతో మాట్లాడారు. ఓటు వేస్తే ప్రశ్నించే హక్కు వస్తుందని అన్నారు. అందుకే అందరూ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. ప్రజల్లో ఓటుహక్కుపై అవగాహన పెంచాలని అధికారులను కోరారు.  తన కుటుంబ సభ్యులతో కలిసి ఓటేయడానికి వచ్చిన ఆయన ఈ సందర్భంగా మాట్లాడుతూ... తనకు ఒంట్లో బాగులేకున్నా కూడా వచ్చి ఓటేశానని చెప్పారు.

కాగా గ్రేటర్ ఎన్నికల్లో సినీరంగానికి చెందిన పలువురు ప్రముఖులు తమ ఓట హక్కు వినియోగించుకున్నారు.   అక్కినేని నాగార్జున అమల - అల్లు అర్జున్ జూబ్లీహిల్స్ లో ఓటు హక్కు వినియోగించుకున్నారు. మూవీ ఆర్ట్ అసోసియేషన్ అధ్యక్షుడు రాజేంద్రప్రసాద్ కూకట్ పల్లి డివిజన్ లో ఓటు వేశారు. మొత్తంగా  ఓటింగ్ శాతం తక్కువగా ఉన్నప్పటికీ ప్రముఖల ఓటింగ్ శాతం మాత్రం ఎక్కువగానే ఉందని పలువురు పేర్కొంటున్నారు.
Tags:    

Similar News