గతంలో చేసిన మిస్టేక్స్ నుండి ప్రతీసారి ఎవరైనా కూడా ఒక లెసన్ నేర్చుకుంటారు. కాని అన్నిసార్లూ ఆ లెసన్లు పెద్దగా వర్కవుట్ కావు. విషయం ఏంటంటే.. ఈ మద్యన వస్తున్న చాలా గేమ్ షోస్ యాంకర్ల మాటలపైనే డిపెండ్ అయ్యి నడుస్తున్నాయి. కాని అందరూ సుమ తరహాలో మాటల ప్రవాహాన్ని పుట్టించలేరుగా. అందుకే స్పెషల్ గా కొంతమంది రైటర్లను పెట్టుకుని మరీ మనోళ్ళు ఏదో ఒకటి రాయిస్తూ ఉంటారు. ఆ డైలాగులను యాంకర్లు చెబుతూ ఉంటారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ విషయంలో కూడా అదే చేశారట.
ఆల్రెడీ పెద్ద పెద్ద హీరోలు చేసిన చాలా గేమ్ షోలకు తెలుగులో పెద్దగా ఆదరణ రాకపోవడంతో.. ఇప్పుడు జూనియర్ చేసే విన్యాసం ఎట్టి పరిస్థితుల్లో ఫ్లాపు కాకూడదని మనోళ్లు ''బిగ్ బాస్'' కార్యక్రమం కోసం ఒక రైటర్ ను పెట్టుకున్నారట. అతను రాసిన డైలాగులనే జూనియర్ ఎన్టీఆర్ తన తొలి షోలో మాట్లాడాడు. కాని ఆ షోలో చూస్తే.. ఎందుకో జూనియర్ పట్టి పట్టి మాట్లాడుతూ ఓవర్ యాక్షన్ చేస్తున్నట్లు కనిపించాడు. పైగా పైగా ఆ పంచు లైన్లు చెప్పడానికి కూడా కొత్త కొత్త హావభావాలను వాడుతూ కొంచెం వింతగా అనిపించాడు. అందుకే తొలి ఎపిసోడ్స్ కు బ్యాడ్ రివ్యూస్ వచ్చాయి. ఇదంతా గమనించిన ఎన్టీఆర్ ఇప్పుడు ఆ రైటర్ ను పక్కనెట్టేసి.. తన డైలాగులు తనే రాసుకుని.. తన పంచులు తనే చెప్పుకుంటున్నాడు. అందుకే మొన్న ఎలిమినేషన్ ఎపిసోడ్ లో చాలా ఆసక్తికరంగా అనిపించాడు. సొంతంగా తనకు వచ్చిన పంచులు వేస్తూ.. సూక్తులు చెబుతూ.. ఇంప్రెస్ చేశాడు ఎన్టీఆర్.
అయితే ఈ రైటర్ సేవలను పూర్తిగా వద్దని చెప్పకుండా.. ఆ రైటర్ తో క్యాండిడేట్ల్ బ్యాగ్రౌండ్ ను రీసెర్చ్ చేయించి కొన్ని పంచులు రెడీ చేయించారట. అలాగే రోజూ జరిగే షో మొత్తం చూసి కూడా ఇంకొన్ని రెడీ చేయిస్తున్నారట. వాటిలో జూనియర్ కు నచ్చినవి తీసుకుని తనకు తగినట్లు మార్చుకుని షోలో చెబుతాడట. అది సంగతి.