కత్తితో పెట్టుకుంటే ఎన్టీఆర్‌కు గొడవలే?

Update: 2015-04-09 07:30 GMT
ఏపీలో రైతుల నుంచి భూములు లాక్కోవడం, 30వేల ఎకరాల్లో రాజధాని నిర్మించడం అనే టాపిక్‌ నలుగుతున్నప్పుడు.. ఎన్టీఆర్‌ 'కత్తి' సినిమాలో నటించడం పెద్ద టాపిక్‌ అవుతోంది. ఈ సినిమాని నల్లమలుపు శ్రీనివాస్‌, ఠాగూర్‌ మధుతో కలిసి నిర్మిస్తున్నారు. ఎస్‌ఇజెడ్‌ల పేరిట రాజకీయనేతలు, కార్పొరెట్‌తో కలిసి ఆడుతున్న నాటకాలు ఎలా ఉన్నాయి? పేదల్ని ఎలా నాశనం చేస్తున్నాయో? చూపించిన సినిమా కత్తి.

పేదలు, బడుగు బలహీన వర్గాలకు ఓ అండ లేనిదే బతుకు కష్టమైన పరిస్థితుల్లో అన్న రంగంలోకి దిగుతాడు. దుర్మార్గపు రాజకీయాల్ని, ప్రభుత్వాల్ని ఎదుర్కోవడానికి అండర్‌గ్రౌండ్‌లో ఉండి మరీ అన్న పోరాడుతాడు. ఇప్పుడు అదే కాన్సెప్టులో ఎన్టీఆర్‌ నటిస్తున్నాడు అంటే దానర్థం.. అక్కడ చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని వ్యతిరేకించడం కిందే లెక్క. పేద రైతుల నుంచి భూముల్ని లాక్కుంటే వాళ్లు తిండికి గతిలేక చావడం ఖాయం.. అన్న పాయింటును 'కత్తి' రీమేక్‌లో ఉపయోగించాల్సిందే. ఒకవేళ ఆ పాయింటును ఉపయోగించకపోతే ఈ రీమేక్‌ జనాలకు ఏమాత్రం కనెక్టవ్వదు.

అసలే చంద్రబాబు వర్గంతో జూ.ఎన్టీఆర్‌కి విభేధాలొచ్చాయి. బాబాయ్‌ బాలయ్యతో ఎన్టీఆర్‌కి గుస్సా నడుస్తోంది. కాబట్టి కచ్ఛితంగా ఏపీ రాజకీయాల్ని ప్రతిభింబించే స్టయిల్లో సినిమా ఉంటే.. మరోసారి అనవసరంగద తెలుగుదేశం పార్టీతో జూనియర్‌కు అనవసరమైన గొడవలు రావంటారా? కుటుంబంలోని గుస్సా ఇంకాస్త ఎక్కువవ్వదా? ప్రస్తుతం ఫ్యాన్స్‌ దీని గురించే వర్రీ అవుతున్నారు.
Tags:    

Similar News