`య‌న్ టీఆర్` ఫ‌స్ట్ లుక్ అదిరింది!

Update: 2018-06-10 08:25 GMT

విశ్వ‌విఖ్యాత న‌ట సార్వ‌భౌమ నంద‌మూరి తార‌క‌రామారావు బ‌యోపిక్ `య‌న్ టీఆర్`ను ఆయ‌న త‌న‌యుడు నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కిస్తోన్న సంగ‌తి తెలిసిందే. క్రిష్ జాగ‌ర్ల మూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తోన్న ఈ చిత్రం ఫ‌స్ట్ లుక్ కోసం నంద‌మూరి అభిమానులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు. నేడు బాల‌య్య బాబు జ‌న్మ‌దినాన్ని పుర‌స్క‌రించుకొని నంద‌మూరి అభిమానుల‌కు `య‌న్ టీఆర్` చిత్ర యూనిట్ అద్భుత‌మైన బ‌హుమ‌తినిచ్చింది. బాల‌కృష్ణ పుట్టిన రోజు సంద‌ర్భంగా `య‌న్ టీఆర్` ఫ‌స్ట్ లుక్ ను చిత్ర యూనిట్ విడుద‌ల చేసింది. ఆ ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్ ను తండ్రీ కొడుకులిద్ద‌రూ నటించిన బ్లాక్ బ‌స్ట‌ర్ హిట్ చిత్రాలలోని పాత్ర‌ల‌తో డిజైన్ చేశారు. అంతేకాకుండా ఆ ఫ‌స్ట్ లుక్ లో బాల‌య్య బాబుకు సంబంధించిన ఆస‌క్తిక‌ర‌మైన విష‌యాల‌ను వెల్ల‌డించ‌డం విశేషం. సోష‌ల్ మీడియాలో విడుద‌లైన ఫ‌స్ట్ లుక్ వైర‌ల్ అయింది.

తాజాగా విడుద‌లైన `య‌న్ టీఆర్` చిత్ర ఫస్ట్‌ లుక్ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతోంది. ఎన్టీఆర్‌ - బాల‌కృష్ణ‌ నటించిన ప‌లు హిట్ చిత్రాల్లోని క్యారెక్ట‌ర్స్ ను ఆ ఫ‌స్ట్ లుక్ లో డిజైన్ చేశారు. బాలకృష్ణకు ఎన్టీఆర్‌ మీసాలు దిద్దుతున్నట్లు ఆ ఫ‌స్ట్ లుక్ కే హైలైట్. ‘తన నూరవ చిత్రంలో అమ్మపేరు ధరించి కూస్తంత మాతృరుణం తీర్చుకున్న బసవ రామ తారక పుత్రుడు, ఇప్పుడు నాన్న పాత్రనే పోషిస్తూ కాస్తంత పితృరుణాన్ని కూడా తీర్చుకుంటున్న తారక రామ పుత్రుడు - శతాధిక చిత్ర ‘నటసింహం’ - నందమూరి బాలకృష్ణ గారికి జన్మదిన శుభాకాంక్షలు..’ అంటూ చిత్ర ఫస్ట్ లుక్‌ ను చిత్రయూనిట్ సోషల్‌ మీడియాలో విడుదల చేసింది.  వారాహి చలన చిత్రం - బాలకృష్ణ సంయుక్తంగా ఈ మెగా ప్రాజెక్టు ను నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో న‌టించ‌బోయే నటీనటుల కోసం ఆడిషన్స్‌ నిర్వహిస్తున్న‌ట్లు చిత్ర యూనిట్ ప్ర‌క‌టించింది.
Tags:    

Similar News