ఎన్టీఆర్ సినిమాలను అభిమానించే వారికి, నందమూరి ఫాన్స్ కి మరపురాని అపురూప చిత్రం దానవీరశూర కర్ణ. సెకండ్ రిలీజ్ లో సైతం కోటి రూపాయల గ్రాస్ సాధించిన ఏకైక తెలుగు సినిమాగా ఇప్పటికీ దాని రికార్డు చెక్కు చెదరకుండా భద్రంగా ఉంది. దాదాపు నాలుగు గంటల వ్యవధి ఉన్న ఆ సినిమాని రెండు ఇంటర్వెల్స్ వేసి చూపిస్తే విసుక్కుకోకుండా ఎగబడి చూసారు జనం. అంతటి గొప్ప కళాఖండానికి రామారావు గారే దర్శకత్వం వహించడం ఆయన మల్టీ టాలెంట్ కి నిదర్శనం. టైటిల్ రోల్ ఎన్టీఆర్ గారే వేసినప్పటికీ అందరిని విపరీతంగా ఆకట్టుకుంది మాత్రం సుయోధనుడి పాత్రే. విలన్ ని కూడా ఆరాధించేలా నటించడం ఒక్క నటసార్వభౌముడికే చెల్లింది. అందులో ఆయన వేషధారణతో పాటు అందరికి గుర్తుండిపోయింది ఆయన వాడిన గద.
ఇన్నేళ్ళ తర్వాత తిరిగి ఆ గదను ఎన్టీఆర్ బయోపిక్ కోసం వాడబోతున్నారు. తేజ దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా నటిస్తున్న ఈ మూవీ టీజర్ షూటింగ్ ఇటీవలే ప్రారంభమైన సంగతి తెలిసిందే. ఇందుకోసం రామకృష్ణ స్టూడియోస్ లో ప్రత్యేకంగా భద్ర పరిచిన ఆ గదను ఇందులో వాడుతున్నారు. రాజసం ఉట్టిపడే దుర్యోధనుడి పాత్రలో బాలకృష్ణను ఊహించుకుని ఫాన్స్ అప్పుడే ఉబ్బితబ్బిబ్బు అయిపోతున్నారు. ఎన్టీఆర్ నటజీవితంలోని కీలక ఘట్టాలన్నీ స్పృశిస్తున్న తేజ దానవీరశూరకర్ణ టైం లో ఎన్టీఆర్ ఎదురుకున్న ఆటుపోట్లను చూపించబోతున్నట్టు టాక్. వివాదాస్పద అంశాల జోలికి వెళ్ళకుండా ఆయన బాల్యంతో మొదలుపెట్టి సినిమా జీవితాన్ని చూపించి చివరిలో మొదటిసారి టిడిపి పార్టీని అధికారంలోకి తెచ్చి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసే దాకే ఈ బయోపిక్ ఉంటుందట. సమ్మర్ తర్వాత విడుదల ప్లాన్ చేస్తున్న ఈ మూవీకి ఇంకా కీలక తారాగణాన్ని సెట్ చేసే పనిలో ఉన్నాడు తేజ,