ఎన్టీఆర్ రేటు అత్యంత ఘాటు!!

Update: 2017-06-14 07:21 GMT
బిగ్ బాస్ షో హిందీలో నెంబర్ వన్ రియాలిటీ షో గా నిలిచింది. బాలీవుడ్ సూపర్ స్టార్ సల్మాన్ ఖాన్ దీనికి హోస్ట్ గా చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే షో ని అన్నీ ప్రాంతీయ భాషలులలో నిర్మిస్తున్నారు. తమిళ్  నాట కమల్ హాసన్ చేస్తుండగా తెలుగు లో యంగ్ టైగర్ ఎన్టీఆర్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ హోస్ట్ చేయడం వలన షో కి మంచి జోష్ తో పాటు ప్రేక్షకులు లో ఆశక్తి కూడా ఉంటుంది అని బిగ్ బాస్ యజమాన్యం భావించి ఫైనల్ చేశారు. వాళ్ళు అంచనాలకు మించి  తెలుగులో మంచి స్పందన వచ్చింది ఎన్టీఆర్ కి ఉన్న క్రేజ్ వలన. కానీ నిజానికి బిగ్ బాస్ టీమ్ కు ఎన్టీఆర్ ఊహించని షాక్ ఇచ్చాడు.

సినిమాలుతో బాగా బిజీగా ఉన్న ఎన్టీఆర్ టి‌వి షో హోస్ట్ చెయ్యడమే పెద్ద వార్త అయ్యింది టాలీవుడ్లో.  అతని డేట్స ఎటువంటి ఇబ్బంది లేని టైమ్ లోనే షూట్ ప్లాన్ చేశారు. కానీ ఒక్కో ఎపిసోడ్ కి  ఎన్టీఆర్ చేస్తున్న చార్జ్ బిగ్ బాస్ టీమ్ కు కొండతో డీ కొట్టినట్లే ఉంది. ఎందుకంటే ప్రతి ఎపిసోడ్ కి సుమారుగా 50 లక్షలు చార్జ్ చేస్తున్నాడు అంటా ఎన్టీఆర్. ఈ షో రానున్న ప్రతి శనివారం 13 వారాలు పాటు బ్రాడ్ కాస్ట్ అవుతుంది. ఇప్పటివరకు నాగార్జున అండ్ మెగాస్టార్ చిరంజీవి కూడా తమ బుల్లితెర ఫీట్ కోసం ఇంతేసి ఛార్జ్ చేయలేదు. ఆ లెక్కన చూసుకుంటే.. ఎన్టీఆర్ కు అంత భారీగా చెల్లించుకుంటున్నారు కాబట్టి .. ఆయన రేటు అత్యంత ఘాటుగా ఉంది కాబట్టి.. ఖచ్చితంగా ఈ షో ను సూపర్ హిట్ చేయాలి. ఆ బాధ్యత ఎన్టీఆర్ మీద కూడా ఉందండోయ్.

కొంతమంది ఫిల్మ్  స్టార్స్ కానీ టి‌వి స్టార్స్ కానీ మిగిలిన రంగాలలో ఫేమస్ అయనవాళ్ళని గాని ఒక పెద్ద బిగ్ బాస్ ఇంటిలో ప్రపంచానికి సంబంధం లేకుండా కొన్ని రోజులు ఉంచుతారు. ఆ ఇంటిలో ఎవరు ఏమి చేస్తారు ఎలా ఉంటారు ఎప్పుడు ఎప్పుడు ఎవరు బయటకు వెళ్లవలిసి ఉంటుంది అనేది ఎన్టీఆర్ హోస్ట్ గా ప్రసారం కానున్న రియాలిటీ షో చూడవలిసిందే.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News