కొడుకు కోసం ఎన్టీఆర్ తల్లి ఏం చేసిందంటే..

Update: 2018-08-12 05:10 GMT
ఎన్టీఆర్ ఈ స్థాయిలో ఉన్నాడంటే అతడి తల్లి షాలినీయే కారణం.. చిన్నప్పటి నుంచి ఎన్టీఆర్ ఇష్టాయిష్టాలను గమనించి అతడికి సంగీతం, నృత్యం, యాక్టింగ్ లలో శిక్షణ ఇప్పించింది. అందుకే తనకు తల్లి తరువాతే ఎవరైనా అని ఎన్టీఆర్ వివిధ వేదికలపై చెబుతుంటాడు.. ఎన్టీఆర్ తన తల్లికి ఇచ్చే ప్రాధాన్యత అంతా ఇంతా కాదు..

ఇక కొడుకు కోసం ఇప్పటివరకూ ఎన్నో త్యాగాలు చేసిన షాలిని.. ఇప్పుడు త్వరలోనే విడుదలయ్యే ఎన్టీఆర్ సినిమా కోసం పూజలు చేసినట్టు వార్తలొస్తున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని సీసిలి సాయిబాబా గుడిని షాలిని సందర్శించారు. అక్కడ ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా సాయిబాబాకు హారతి ఇస్తోన్న ఫొటో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. ఈ ఫొటోను ఎన్టీఆర్ అభిమానులు తెగ షేర్ చేస్తున్నారు.

ప్రస్తుతం ఎన్టీఆర్.. త్రివిక్రమ్ దర్శకత్వంలో ‘అరవింద సమేత’ అనే సినిమా చేస్తున్నారు. ఈ మూవీ టీజర్ ను మరో నాలుగు రిలీజ్ చేసేందుకు యూనిట్ సిద్ధమైంది. ‘అజ్ఞాతవాసి’తో అపఖ్యాతి తెచ్చుకున్న త్రివిక్రమ్ ఈ మూవీపై ఫుల్ ఫోకస్ పెట్టారు. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ తల్లి షాలిని తన కొడుకు తాజా చిత్రం హిట్ కావాలని పూజలు చేసిందని ఎన్టీఆర్ అభిమానులు ఆ ఫొటోను తెగ షేర్ చేస్తున్నారు. ఎంతైనా తల్లి ప్రేమ ఇదే అంటూ కొనియాడుతున్నారు.
Tags:    

Similar News