1-నేనొక్క‌డినేకి కంటిన్యూష‌న్ పార్ట్‌ లా..

Update: 2015-12-10 04:33 GMT
1-నేనొక్క‌డినే సినిమా చూసిన‌వారికి ఓ సంగ‌తి స్ప‌ష్టంగా అర్థ‌మ‌వుతుంది. అది సైక‌లాజిక‌ల్ థ్రిల్ల‌ర్ మాత్ర‌మే కాదు.. మ‌హేష్ త‌న బాల్యాన్ని గుర్తు చేసుకునే క్ర‌మం ప‌రిశీలిస్తే.. ఓ కోణంలో తండ్రి కొడుకుల మ‌ధ్య సెంటిమెంట్ స్టోరీలా ఉందే అనిపిస్తుంది. త‌న‌ని తాను మ‌హేష్ గుర్తు చేసుకునే క్ర‌మంలో గౌత‌మ్ ని ప్రిన్స్ ఊహించుకుంటుంటే  ఆ ఇద్ద‌రినీ ఒకే ఫ్రేములో చూసుకున్న ప్రేక్ష‌కుల‌కు తండ్రి కొడుకుల అనుబంధం క‌నిపిస్తుంది. ఇప్పుడు అదే పాయింటుకి క‌నెక్టివిటీ ఇస్తూ..  నాన్న‌కు ప్రేమ‌తో సినిమా తీస్తున్నాడా?  సుకుమార్ అనిపిస్తోంది.

ఎన్టీఆర్ క‌థానాయ‌కుడిగా నాన్న‌కు ప్రేమ‌తో తెర‌కెక్కుతున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమా క‌థాంశం టైటిల్‌ కి త‌గ్గ‌ట్టే తండ్రి - కొడుకుల‌కు సంబంధించిన‌ది. నాన్న రుణం తీర్చుకునేందుకు కొడుకు ఏం చేశాడు? అన్న‌ది తెర‌పై చూడాల్సిందేన‌ని ద‌ర్శ‌క‌నిర్మాత‌లు చెబుతున్నారు. అంటే ఈ మూవీలో తండ్రి కొడుకుల సెంటిమెంట్ స‌న్నివేశాలు పూర్తి ఉద్విగ్న భ‌రితంగా ఉంటాయ‌ని అంద‌రికీ అర్థ‌మ‌వుతోంది. ఎన్టీఆర్ లుక్‌ - గెట‌ప్ కాస్త కొత్త‌గా ప్ర‌య‌త్నించారు. అయితే కంటెంట్ ప‌రంగా తెలుగు నేటివిటీ - సెంటిమెంటు పుష్క‌లంగా జోడించి సుక్కూ మ‌రో ఎక్స్‌ పెరిమెంట్ చేస్తున్న‌ట్టే అనిపిస్తోంది. ప్ర‌యోగం చేస్తూనే తెలుగు ప్రేక్ష‌కులు ఓన్ చేసుకునేలా కంటెంట్‌ ని ఎంచుకున్నాడా? అనిపిస్తోంది. ఎన్టీఆర్ పెర్ఫామెన్స్‌ లో బ్రిలియ‌న్సీ - నేటివిటీ క‌థ‌ - తండ్రి కొడుకుల సెంటిమెంట్ ఈ సినిమాకి పెద్ద ప్ల‌స్ అవుతాయ‌ని ప‌రిశీల‌కుల‌కు అర్థ‌మ‌వుతోంది.

ముఖ్యంగా ఎన్టీఆర్ తండ్రికి ఇచ్చిన ప్రామిస్ ఏంటి? అత‌డు లండ‌న్ ఎందుకు వెళ‌తాడు? అన్న‌ది ఇంత‌వ‌ర‌కూ స‌స్పెన్స్‌. మ‌రి క‌థ‌లో ఏం గ‌మ్మ‌త్త‌యిన విష‌యాలున్నాయో అనిపిస్తోంది. 1లో ఉన్న‌ట్టు సైక‌లాజిక‌ల్ బేస్డ్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్ ఈ చిత్రంలో లేక‌పోయినా.. అంతకుమించిన ట్విస్టేదో ఉంటుంద‌నే అనిపిస్తోంది. ఏదేమైనా ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 13న రిలీజ‌వుతోంది. ఇంకో నెల‌రోజులు వెయిట్ చేస్తే మ‌న‌కే అర్థ‌మ‌వుతుంది అస‌లు ట్విస్టు.
Tags:    

Similar News