యంగ్ టైగర్ ఎన్టీఆర్ మాంచి కసి మీద ఉన్నాడు. నాన్నకు ప్రేమతో చిత్రంతో తన కెరీర్ హిట్ కొట్టి, యాభై కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అవ్వాలని చూస్తున్నాడు. అందుకోసం గెటప్ తో సహా అన్నీ కొత్తగా ట్రై చేస్తున్నాడు. రిలీజ్ విషయంలో సంక్రాంతి పండుగ రోజును అంత సీరియస్ గా తీసుకోవడానికి కూడా... ఈ యాభై కోట్ల క్లబ్ లో ఎంట్రీ కోసమే అని ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు.
ఈ ఏడాది వచ్చిన జూనియర్ ఎన్టీఆర్ మూవీ టెంపర్... 43 కోట్ల దగ్గర ఆగిపోయింది. అంత పాజిటివ్ వచ్చిన మూవీ.. ఖచ్చితంగా హాఫ్ సెంచరీ కొడుతుందని అనుకున్నా.. అంచనాలు రీచ్ కాలేదు. దీంతో ఇప్పుడు ఈ మార్క్ తారక్ కి ప్రెస్టేజ్ క్వశ్చన్ గా మారిపోయింది. అలాగని దీన్ని అందుకోవడం అంత సలుభమైన విషయమేమీ కాదు. ముఖ్యంగా సోలో రిలీజ్ అడ్వాంటేజ్ లేకపోతే మాత్రం.. మరోసారి నిరుత్సాహపడాల్సి వస్తుంది. ఇప్పుడు బాలయ్యతో డైరెక్ట్ గా పోటీ పడనుండడం ఇబ్బంది కలిగించే విషయమే. ఈ పోటీ నుంచి బాలకృష్ణ తప్పుకునే అవకాశం ఎట్టి పరిస్థితుల్లోనూ లేదు. పైగా ఇది ఆయనకు 99వ చిత్రం. వాస్తవంగా చెప్పాలంటే 100 వ చిత్రంతో పోల్చితే.. డిక్టేటర్ పై ఉన్న ఎక్స్ పెక్టేషన్స్ తక్కువే. కానీ జూనియర్ సంగతి అలాక్కాదు. ఈ మూవీతోనే కెరీర్ హిట్ కొట్టాల్సిన పరిస్థితి. తర్వాతి మూవీతో కొట్టినా.. ఆ క్రెడిట్ కొరటాల పట్టుకెళ్లిపోయే ఛాన్స్ ఉంది. అందుకే ఓ ఫ్లాప్ తర్వాత సుకుమార్ తీస్తున్న సినిమాతో ఈ ఫీట్ సాధిస్తేనే.. ఆ యాభై కోట్ల క్రెడిట్ ఎన్టీఆర్ కి దక్కేది.
అందుకే ఆ మార్కు కావాలంటే.. ఇప్పుడు ఎన్టీఆర్ మారక తప్పదనే సలహాలు వినిపిస్తున్నాయి. డేట్ మారితే 40 నుంచి 50 కోట్ల క్లబ్ లోకి ఎంటర్ అయ్యే ఛాన్సులు పెరుగుపోతాయి. సోలో రిలీజ్ కోసం బాలయ్యతో పోటీ నుంచి తప్పుకోవాలంటున్నారు చాలామంది ఫ్యాన్స్. మరి ఎన్టీఆర్ ఏమంటాడో !