ఈ మధ్య జూనియర్ ఎన్టీఆర్ తన సినిమాల ప్రి రిలీజ్ ప్రమోషన్లకు వచ్చినపుడల్లా అతడికి ఎదురవుతున్న ప్రశ్న.. మీ బాబాయితో మీకు ఇబ్బందేంటి అని. దానికి అతను సింపుల్ గా మా బాబాయితో నాకేంటి ఇబ్బంది అని నవ్వేస్తాడు. తమ ఇద్దరి మధ్య సన్నిహిత సంబంధాలున్నాయని.. ఆయనతో కలిసి సినిమా చేయడానికి కూడా రెడీ అని స్టేట్మెంట్ కూడా ఇస్తాడు. కానీ బాబాయిని కలవాల్సిన సందర్భం.. అవసరం వచ్చినా అతను కలవడు. ఇటీవల రెండు కీలక సందర్భాల్లో తారక్.. బాలయ్యను కలవాల్సిన అవసరం ఉన్నా.. కలవకపోవడం చర్చనీయాంశమవుతోంది.
ఇటీవలే నారా లోకేష్ ఆంధ్రప్రదేశ్ కేబినేట్లో మంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన కార్యక్రమానికి నందమూరి కుటుంబం నుంచి చాలామంది హాజరయ్యారు. తెలుగుదేశం పార్టీ వ్యవహారాలపై.. తన సోదరుడు బాలయ్య.. బావ చంద్రబాబు తనతో వ్యవహరిస్తున్న తీరు పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్న ఎన్టీఆర్ తండ్రి హరికృష్ణ సైతం ఈ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అలాగే ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్ కూడా వచ్చాడు. కానీ ఎన్టీఆర్ రాలేదు. షూటింగ్ లో బిజీ.. నిర్మాత ఒప్పుకోడు అని తప్పించుకోవడానికి కూడా లేదు. అతడి సినిమాకు నిర్మాత కళ్యాణ్ రామే. ఒక పూట షూటింగ్ వద్దనుకుని రావడానికి ఇబ్బందేమీ లేదు. అయినా తారక్ రాలేదు. తర్వాత ‘జనతా గ్యారేజ్’ సినిమాలో ఎన్టీఆర్ వాడిన బైక్ మీద కాంటెస్ట్ పెట్టగా వచ్చిన రూ.10 లక్షల చెక్కును పట్టుకెళ్లి చిత్ర నిర్మాతలు.. దర్శకుడు బాలయ్యకు అందజేశారు. ఆ కార్యక్రమానికి ఎన్టీఆర్ రాలేదు. దీన్ని బట్టి బాబాయితో అబ్బాయి సంబంధాలు ఎలా ఉన్నాయో.. అర్థం చేసుకోవచ్చు.
Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/