నా కొడుకు క్రికెటర్ అవ్వాలి

Update: 2018-04-03 17:18 GMT
సాధారణంగా జూనియర్ ఎన్టీఆర్ మాట్లాడితే ఎంత ఆకర్షణీయంగా ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బిగ్ బాస్ తరువాత ఐపిఎల్ బ్రాండ్ అంబాసిడర్ బాధ్యతలను తీసుకొంటున్న తారక్ బయట కూడా చాలా బాగా మాట్లాడుతున్నాడు. అయితే 2018 ఐపీఎల్ సీజన్11 స్టార్ మా లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. అలాగే తెలుగులో కామెంట్రీ రాబోతోంది. అందుకోసం రీసెంట్ గా ఐపీఎల్ తెలుగు లాంగ్వేజ్ కి ప్రచార కర్తగా ఎన్టీఆర్ అవతారం ఎత్తేశాడు.

ఈ సందర్భంగా పార్క్ హయత్ లో జరిగిన మీడియా సమావేశంలో ఎన్టీఆర్ మాట్లాడారు. ఎన్టీఆర్ ఎమ్మన్నారంటే.. ఐపీఎల్ బ్రాండ్ అంబాసిడర్‌గా సెలెక్ట్ అయినందుకు చాలా హ్యాపీగా ఉంది. ఒక ఫ్యామిలీ లాగా భావిస్తున్నా. ఐపీఎల్ తెలుగు తప్పకుండా అందరికి నచ్చుతుందని అనుకున్నా. భాషతో సంబంధం లేకుండా అందరిని కలిపే క్రీడలు చాలా మంచివి. క్రికెట్ అనేది మన రక్తంలోని ఉంది. అది ఒక వారసత్వం లాగా కొనసాగుతోంది. మా నాన్న చూడటం వల్ల నేను ఆసక్తి పెంచుకున్నా. నా కొడుకు కూడా ఇష్టపడతాడు అనుకుంటున్నా. అలాగే నా కొడుకు క్రికెటర్ అయితే తప్పకుండా అంగీకరిస్తా. నాకు సచిన్ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు ధోని కూడా చాలా ఇష్టం. అలా అని సచిన్ తక్కువ కాదు. సచిన్ సచినే.. అంటూ సెలవిచ్చాడు.

ఇంకా చెబుతూ.. ''క్రీడలు ఒక లాంగ్వేజ్‌ లాగా కూడా ఉపయోగపడతాయి. పేరెంట్స్ పిల్లల మీద ఒత్తిడి తీసుకురాకూడదు. ఎందుకంటే క్రీడల ద్వారా ఒకరితో ఒకరు సంభాషించుకోగలరు. ఇక ఐపీఎల్ క్రికెట్ లో ఎన్నో మార్పులు తెచ్చింది. నన్ను తెలుగు భాషకు ప్రచార కర్తగా ఎన్నుకున్నందుకు మరొకసారి స్టార్ మా వారికి నా కృతజ్ఞతలు తెలుపుతున్నాను'' అని ఎన్టీఆర్ వ్యాఖ్యానించారు.
Tags:    

Similar News