ఎన్టీఆర్‌ మళ్ళీ కత్తి పడుతున్నాడా?

Update: 2015-08-05 04:10 GMT
అప్పుడెప్పుడో చిన్నపటి నుండి ఈ సినిమా రీమేక్‌ గురించి కహానీలు వింటూనే ఉన్నాం. తమిళంలో హిట్టయిన సినిమా ''కత్తి''. దీనిని విజయ్‌ హీరో గా మురుగుదాస్‌ తీశాడు. కార్పొరేట్‌ బాబులపై విరుచుకుపడే సబ్జెక్ట్‌ ఇది. సినిమాలో నీళ్ళను దోచుకునే కంపెనీ లపై, రైతుల భూములు లాక్కొని వ్యాపారాలు చేసుకొని కార్పొరేట్‌ దిగ్గజాలపై చాలా తెలివిగా తన బాణాలు ఎక్కుపెట్టాడు మురుగుదాస్‌. అయితే తెలుగులో ఈ సినిమాను రీమేక్‌ చేయాలంటే పలు రకాలుగా రాజకీయ ఎఫీలియేషన్స్‌ ఉన్న మన హీరోలు అస్సలు ముందుకు రాలేదులే.

మొదట్లో ఈ సినిమాను పవన్‌ కళ్యాణ్‌ కు చూపిస్తే, ఆయనకు పెద్దగా నచ్చలేదట. ఆ తరువాత రవితేజను అనుకున్నారు. మనోడు ఈ మధ్య కాలంలో అన్నీ ఫ్లాపులే కొట్టి చాలా కష్టం మీద పవర్‌, బలుపు సినిమాలతో హిట్లు కొట్టాడు. ఇప్పుడు మళ్ళీ ప్రయోగాలు ఎందుకులే అనుకుంటూ మిడిల్‌ డ్రాప్‌ అయిపోయాడు. కట్‌ చేస్తే.. సినిమా ఎన్టీఆర్‌ కోర్టు లోకి వచ్చింది. మనోడు కూడా నో అనే చెప్పాడు. అసలే ఇప్పటికే తెలుగుదేశం పార్టీ తో కాస్త అంటీముట్టనట్లు ఉంటున్నాడేమో, ఇప్పుడు సడన్‌ గా ఇలాంటి సందేశాత్మక సంచలన సినిమా తీస్తే అది పార్టీని టార్గెట్‌ చేసినట్లే ఉంటుందని భావించి ఈ సినిమాను రీమేక్‌ చేయకూడదని ఎన్టీఆర్‌ ఫీలైనట్లు అప్పట్లో టాక్‌ వచ్చేసింది. ఇక ఈ గోల అంతా ఎందుకులే అని ఎట్టకేలకు కత్తి సినిమాను తెలుగులో డబ్బింగ్‌ చేసి రిలీజ్‌ చేసేయాలని నిర్ణయించకున్నారు రీమేక్‌ హక్కులు కొనుక్కున్న నిర్మాతలు.

డబ్బింగ్‌ మొత్తం పూర్తి చేసేసి, చివరకు ఫస్ట్‌ లుక్‌ పోస్టర్స్‌ కూడా రెడీ చేయించేశారు. ఆల్రెడీ సినిమా వాల్‌ పేపర్స్‌ నెట్టు లోకి వదిలారు కూడా. ఈ సమయంలో ఇప్పుడు ఎన్టీఆర్‌ ఈ సినిమా కూడా తానే చేస్తే బాగుంటుందని అనుకుంటున్నాడని న్యూస్‌ వచ్చేసింది. ఎంతవరకు నిజమో తెలియదు కాని, పాపం డబ్బింగ్‌ కూడా చేసుకొని రిలీజ్‌ కు ప్లాన్‌ చేసుకుంటుంటే సడన్‌ గా ఇప్పుడు ఎన్టీఆర్‌ ఈ సినిమాను చేయాలని అనుకోవడమేంటి? మరి ఆ రాజకీయ సమీకరణాలు ఇప్పుడు అడ్డురావా? ఏదేమైనా అఫీషియల్‌ న్యూస్‌ వచ్చేవరకు మనం ఎటువంటి కామెంట్లూ చేయలేం.. సో, వెయిట్‌ ఫర్‌ న్యూస్‌!!

Tags:    

Similar News