టాలీవుడ్ టు హాలీవుడ్..ఇప్పుడు ఏ నోట విన్నా ఒకటే మాట RRR.. RRR.. RRR.. రాజమౌళి అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ఈ మూవీ ప్రపంచ వ్యాప్తంగా అంతర్జాతీయ వేదికలపై సత్తా చాటుకుంటోంది. హాలీవుడ్ దిగ్గజాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా భావించే గోల్డెన్ గ్లోబ్ పురస్కారాల్లో 'నాటు నాటు' సాంగ్ కు గానూ ఒరిజినల్ సాంగ్ విభాగంలో అవార్డుని దక్కించుకుని విశ్వవేదికపై తెలుగు సినిమా సత్తాని యావత్ ప్రపంచానికి చాటి చెప్పింది.
దీంతో ఒక్కసారిగా యావత్ ప్రపంచం చూపు RRRపై పడింది. ఒక్క గోల్డెన్ గ్లోబ్ పురస్కారమే కాకుండా క్రిటిక్స్ ఛాయిస్ పురస్కారాల్లోనూ RRR విజయ దుందుభి మోగించింది. క్రిటిక్స్ ఛాయిస్ పురస్కారాల్లో ఈ సినిమాకు ఏకంగా రెండు అవార్డులు దక్కడం విశేషం. ఇదిలా వుంటే త్వరలో మార్చి 12న యుఎస్ లో అట్టహాసంగా జరగనున్న ఆస్కార్ అవార్డుల్లోనూ RRR నామినేషన్స్ ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఫైనల్ గా జరిగిన షార్ట్ లిస్ట్ లో RRR స్థానాన్ని దక్కించుకోవడంతో ఆస్కార్ ఆవార్డుల్లో పోటీపడే అర్హతని దక్కించుకుంది.
RRR తో పాటు మన దేశం నుంచి దాదాపు పది సినిమాలు విదేశీ చిత్రాల విభాగంలో పోటీపడుతున్నాయి. ఇందులో కాంతార, ది కశ్మీర్ ఫైల్స్, విక్రాంత్ రోణతో పాటు పలు సినిమాలు ఇండియా నుంచి ఆస్కార్ కు పోటీ పడుతున్నాయి. హాలీవుడ్ దిగ్గజ దర్శకులు స్టీవెన్ స్పీల్ బర్గ్ , జేమ్స్ కామెరూన్ ల దృష్టిని ఆకర్షించిన RRR ఆస్కార్ అకాడమీ అవార్డుల్లో సత్తా చాటడం ఖాయం అనే వార్తలు, విశ్లేషణలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో RRR కు గానూ హీరో ఎన్టీఆర్ పేరు ప్రముఖంగా వినిపిస్తుండటం పలు అంతర్జాతీయ వార్తా సంస్థలు ఆస్కార్ రేసులో ఎన్టీఆర్ పేరుని ప్రముఖంగా ప్రస్తావించడం ఆసక్తికరంగా మారింది. ప్రముఖ యుఎస్ టుడే ఆస్కార్ కు పోటీపడుతున్న టాప్ 10 నటీనటుల జాబితాని తాజాగా విడుదల చేసింది. ఇందులో వరల్డ్ ఫేమస్ యాక్షన్ హీరో టామ్ క్రూయిజ్ ని సైతం వెనక్కి నెట్టి టాప్ లో ఎన్టీఆర్ నిలవడం పలు దేశాల వారిని విస్మయానికి గురిచేస్తోంది.
అయితే మన దేశం వారు మాత్రం సంబరాలు చేసుకుంటున్నారు. జనవరి 24న ఆస్కార్ ఫైనల్ లిస్ట్ ని ప్రకటించబోతున్నారు. మరో మూడు రోజుల్లో ఏం జరగనుందో తేలిపోనున్న నేపథ్యంలో ఇండియన్ అభిమానుల్లో తీవ్ర ఉత్కంఠ నెలకొంది. అంతా చెప్పినట్టే హాలీవుడ్ హేమా హేమీలని దాటి ఆస్కార్ ఎన్టీఆర్ ని వరిస్తుందా? .. వరిస్తే దేశ సినీ చరిత్రలో సువర్ణాధ్యాయాన్ని RRR లిఖించడం ఖాయం అని పలువురు విమర్శకులు, సెలబ్రిటీలు ఆశా భావం వ్యక్తం చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.