ఇప్పుడు ఎక్కడ చూసినా కూడా అసలు తాము తీసే సినిమాలను ఎన్టీఆర్ ఒక క్రిటికల్ పేషెంటుతో ఎందుకు పోల్చాడు.. అలాగే రివ్యూ రైటర్లపై దారినపోయే దానయ్యలంటూ ఎందుకు కామెంట్ చేశాడు అనే విషయంపై చర్చ జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ యవ్వారంపై చాలామంది రివ్యూ రైటర్లు కూడా తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. అయితే ఈ విషయానికి ఒకేసారి ఫుల్ స్టాప్ పెట్టేయాలని అనుకుంటున్నాడట ఎన్టీఆర్.
'జై లవ కుశ' సినిమాకు ఇచ్చిన నెగెటివ్ రివ్యూలను ఉద్దేశించి.. కొందరు క్రిటిక్స్ పేషెంట్లను చంపేస్తున్నారు అంటూ ఎన్టీఆర్ కామెంట్ చేశాడు. అయితే ఈ మాటలతో కొందరు కాదు కాని.. దాదాపు అందరూ హర్టయ్యారు. అందుకే ఇప్పుడు మీడియా అందరికీ పర్సనల్ గా ఎన్టీఆర్ సారీ చెప్పనున్నాడట. విషయం ఏంటంటే.. ఎన్టీఆర్ ను టార్గెట్ చేయడం ఆపేయండి.. ఎందుకంటే మీకు రేపోమాపో సారీ చెప్పడానికి ఒక ప్రెస్ మీట్ పెడుతున్నాడు అంటూ ఇప్పుడు ఎన్టీఆర్ టీమ్ కొన్ని ఫీలర్లను పంపించింది. మరి సినిమా మీద నెగెటివ్ కామెంట్స్ పడకుండా ఆపడానికే ఇలా చేస్తున్నారా? లేదంటే నిజంగానే ఎన్టీఆర్ ఏదన్నా సారీ లాంటివి చెప్పడం.. తన మాటలపై ఏదన్న వివరణ ఇస్తున్నాడా? అనేది తెలియాల్సి ఉంది.
మరోవైపు చూసుకుంటే.. ఇప్పటికే పండగ సినిమాల్లో పెద్ద హీరో సినిమాల్లో ఎన్టీఆర్ కు మాంచి ఎడ్వాంటేజ్ అనేది వచ్చేసింది. కాబట్టి సినిమాను ఇంకా ప్రమోట్ చేసి మరింత కలక్షన్లు వచ్చేందుకు యత్నం చేస్తున్నారట. అందుకే కొన్ని ప్రెస్ మీట్లు ఇంటర్యూలు మళ్ళీ ఇవ్వనున్నారని అంటున్నారు మీడియా వర్గాలు.