ఇప్పటిదాకా మహేష్ బాబు, పవన్ కళ్యాణ్లదే టాలీవుడ్లో టాప్ రెమ్యూనరేషన్ అనుకుంటున్నాం. వీళ్లిద్దరూ ఒక్కో సినిమాకు రూ.15 కోట్లకు అటు ఇటుగా పారితోషకంగా తీసుకుంటున్నట్లు సమాచారం. ఐతే గత కొన్నేళ్లలో ఎన్టీఆర్ వాళ్లిద్దరి స్థాయిలో రికార్డు హిట్లేమీ ఇవ్వలేదు. అయినప్పటికీ ఈ నందమూరి హీరోకు రూ.20 కోట్ల పారితోషకం ఆఫర్ చేసిందట ఓ నిర్మాణ సంస్థ. ఐతే ఎన్టీఆర్ ఆ బంపర్ ఆఫర్ ను తిరస్కరించినట్లు సమాచారం. తమిళంలో గత నెల దీపావళి సందర్భంగా విడుదలై బ్లాక్ బస్టర్ హిట్టయిన ‘వేదాలం’ మూవీని తెలుగులో రీమేక్ చేయడం కోసం ఎన్టీఆర్ కు ఈ ఆఫర్ ఇచ్చినట్లు సమాచారం. కానీ ఎన్టీఆర్ అందుకు ఒప్పుకోలేదట.
వేదాలం సిస్టర్ సెంటిమెంట్ నేపథ్యంలో సాగే సినిమా. ఇంతకుముందు ఇదే సెంటిమెంటుతో ఎన్టీఆర్ ‘రాఖీ’ సినిమా చేశాడు. ఆ సినిమాతో మంచి పేరైతే వచ్చింది కానీ.. సినిమా మాత్రం కమర్షియల్ గా సక్సెస్ కాలేదు. ముఖ్యంగా ఎన్టీఆర్ ఫ్యాన్స్ నుంచి ఈ సినిమా విషయంలో నెగెటివ్ రెస్పాన్స్ వచ్చింది. ఇలాంటి సెంటిమెంటు సినిమాలు చేయొద్దని ఎన్టీఆర్ కు సూచనలందాయి. ఇక హీరోయిన్ సెంటిమెంటు ఉన్న ‘ఊసరవెల్లి’ కూడా అలాంటి ఫలితమే ఇచ్చింది. అందులోనూ టెంపర్ - నాన్నకు ప్రేమతో కొంచెం సీరియస్ సినిమాలు కావడంతో తర్వాత మాంచి ఎంటర్టైనర్ చేయాలనుకుంటున్నాడు ఎన్టీఆర్. అదే సమయంలో రొటీన్ సినిమాలు కూడా ఇష్టపడట్లేదు. అందుకే ‘వేదాలం’ ఆఫర్ ను వద్దనుకున్నాడట.