బ్రహ్మానందం.. సునీల్ కమెడియన్లు కారా? ఇదేం మాట అనిపిస్తోందా? ఐతే ఎన్టీఆర్ మాత్రం ఈ మాటే నొక్కి వక్కాణిస్తున్నాడు. వాళ్లు బేసిగ్గా కమెడియన్లు కారని.. గొప్ప నటులని.. నవరసాలూ పండించగల సామర్థ్యం వాళ్లకు ఉందని తారక్ అన్నాడు. ఐతే నవరసాల్లో మిగతా రసాల్ని వదిలేసి.. వాళ్ల నుంచి నవ్వు రసాన్ని మాత్రమే తీసుకుంటున్నామని తారక్ అన్నాడు. తెలిసో తెలియకో వాళ్లకు కామెడీ పాత్రలు మాత్రమే ఇచ్చి వాటికే పరిమితం చేశామని అతను చెప్పాడు.
బ్రహ్మానందం కరుణ రసాన్ని కూడా అద్భుతంగా పండించగలరని.. ‘బాబాయ్ హోటల్’ లాంటి సినిమాలు అందుకు నిదర్శనమని అన్నాడు తారక్. అలాగే ‘లిటిల్ సోల్జర్స్’ సినిమాలో సరేలే ఊరుకో పాటలో బ్రహ్మానందాన్ని చూస్తే తనకు కన్నీళ్లు వస్తాయన్నాడు. సునీల్ కూడా అంతే అని.. అన్ని రసాలూ బాగా పండించగలడని అన్నాడు. ‘అరవింద సమేత’లో సునీల్ పాత్ర చాలా బాగుంటుందని చెప్పాడు. ప్రధానంగా కామెడీనే చేసినప్పటికీ.. వేరే రసాల్ని కూడా పండించాడన్నాడు. హీరోకు అండగా నిలిచే పాత్ర అతడిదని.. కథలో కీలకంగా ఉంటుందని అన్నాడు.
సునీల్ తో ఇంతకుముందు తాను చేసింది రెండు సినిమాలే అని.. ‘నాగ’ తర్వాత ‘రాఖీ’లో నటించానని.. ఆ తర్వాత ఎందుకో తమ ఇద్దరి కలయికలో సినిమాలు రాలేదని.. కానీ తక్కువ సినిమాల్లో నటించినప్పటికీ వ్యక్తిగతంగా తమ ఇద్దరి మధ్య గొప్ప అనుబంధం ఉందని ఎన్టీఆర్ అన్నాడు. రేప్పొద్దున తనకేదైనా కష్టం వస్తే వెంటనే తన దగ్గర వాలిపోయే మిత్రుల్లో సునీల్ కూడా ఒకడని.. వ్యక్తిగతంగా అతను తనకు చాలా ఇష్టమని ఎన్టీఆర్ చెప్పాడు.