యంగ్ టైగర్ అరుపులు మొదలయ్యాయి

Update: 2017-08-22 08:58 GMT
నందమూరి వారసుడిగా టాలీవుడ్ ని తనదైన శైలిలో ఏలుతూ..  బాక్స్ ఆఫీస్ హిట్స్ అందుకుంటున్న హీరో జూనియర్ ఎన్టీఆర్. ఇప్పటివరకు ఎన్నో విభిన్న పాత్రలతో తెలుగు ప్రజల మనసును దోచుకున్న తారక్ రియాలిటీ షో అయినా బిగ్ బాస్ తో కూడా మరింత దగ్గరవుతున్నాడు. ఇప్పటికే హోస్ట్ గా సూపర్ అనిపించుకున్న తారక్ ఇక తన కొత్త చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నాడు.

ప్రస్తుతం "జై-లవ-కుశ" లాంటి మూడు విభిన్నమైన పాత్రలతో తెరకెక్కుతున్న జై లవకుశ సినిమా షూటింగ్ ను రీసెంట్ పూర్తి చేసిన తారక్ డబ్బింగ్ పనులను కూడా మొదలు పెట్టేసి త్వర త్వరగా పూర్తి చేయాలనీ అనుకుంటున్నాడట. ప్రస్తుతం ఆ మూడు పాత్రలకు ఒకేసారి డబ్బింగ్ చెబుతూ..బిజీ బిజీగా ఉన్నాడట. ముఖ్యంగా ఇందులో ఒక పాత్ర చేసే అరుపులు.. మరో పాత్రల తాలూకు వాయిస్ మాడ్యులేషన్.. సినిమాలో చాలా కొత్తగా ఉంటాయని అంటున్నారు. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్స్ పాత్రల ఫస్ట్ లుక్స్ ఆకట్టుకుంటున్నాయి. ఇక "లవ" ఫస్ట్ లుక్ ని రీసెంట్ గా రిలీజ్ చేసిన నిర్మాత కళ్యాణ్ రామ్ టీజర్ ని ఎప్పుడు రిలీజ్ చేయాలన్న విషయాన్ని రేపు తెలియజేయనున్నాడు.

ఈ చిత్రాన్ని "పవర్- సర్దార్ గబ్బర్ సింగ్" చిత్రాల దర్శకుడు కె.ఎస్ రవీంద్ర (బాబీ) తెరకెక్కిస్తున్న సంగతి తెలిసిందే. ఇక ఎన్టీఆర్ అన్నయ్య కళ్యాణ్ రామ్- ఎన్టీఆర్ ఆర్ట్స్ ప్రొడక్షన్స్ లో ఈ సినిమాను సెప్టెంబర్ 21న రిలీజ్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన రాశి ఖన్నా- నివేత థామస్ కథానాయికలు నటిస్తున్నారు.       
Tags:    

Similar News