ప్రపంచమంతాట పాపులర్ అయిన బిగ్ బాస్ షో హిందీ నుంచి టాలీవుడ్ కి పాకిన సంగతి తెలిసిందే. కోలీవుడ్ లో కూడా స్టార్ట్ అయినప్పటికీ అంతగా పాపులర్ అవ్వలేదు కానీ తెలుగులో మాత్రం ఎన్టీఆర్ హోస్టింగ్ లో మంచి సక్సెస్ ను అందుకుంది. పదివారాల వరకు ప్రసారమైన ఆ రియాలిటీ షోతో యాక్టర్స్ కి కూడా మంచి గుర్తింపు అందింది. అయితే ఈసారి నిర్వాహకులు హంగామాను కాస్త ఎక్కువగా ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.
ఈ ఏడాది జూన్ లో స్టార్ట్ కాబోయే షో కోసం అప్పుడే గ్రౌండ్ వర్క్ ను స్టార్ట్ చేశారు. కాని మొదటి సీజన్ లా కాకుండా ఈ సారి నాలుగు వారాలను ఎక్కువగా యాడ్ చేయనున్నారు. అంటే మొత్తంగా 14 వారాలు ఈ షో కోనసాగనుంది. ఇక రెండవ సీజన్ కి కూడా మళ్లీ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా వ్యవహరించబోతున్నాడు. తారక్ గత ఏడాది జై లవకుశ షూటింగ్ ని బిగ్ బాస్ షోను ఒకేసారి కొనసాగించిన సంగతి తెలిసిందే. ఇక ఇప్పుడు అదే తరహాలో త్రివిక్రమ్ ప్రాజెక్టులో పాల్గొంటూనే బిగ్ బాస్ సీజన్ 2ను ఎన్టీఆర్ ఫినిష్ చేయనున్నాడట.
ఇక సీజన్ 2 కోసం ఇప్పటికే కొంత మంది తారలను అనుకున్నట్లు తెలుస్తోంది. డిమాండ్ పెరగడంతో కొన్ని రికమండేషన్స్ కూడా నడుస్తున్నట్లు టాక్ వినిపిస్తోంది. అయితే ఎవరిని నిర్ణయిస్తారు అనేది షో స్టార్ట్ అయిన తరువాతే తెలుస్తుంది. ఇక స్టార్ మా హైదరాబాద్ లోని ఓ ప్రముఖ స్టూడియోస్ లోనే బిగ్ బాస్ 2 సెట్ వేయనున్నట్లు సమాచారం.