నిన్న సాయంత్రం నుంచి సోషల్ మీడియాతో పాటు కొన్ని ఆన్ లైన్ వెబ్ సైట్స్ లో జూనియర్ ఎన్టీఆర్ పండంటి పాపకు తండ్రయ్యాడు అని పేర్కొంటు ఏకంగా అభినందనల పర్వం మొదలుపెట్టేసారు. దీన్ని నిజమనుకున్న ఫాన్స్ విషెస్ చెబుతూ ఆనందాన్ని పంచుకోవడం మొదలు పెట్టారు. నిజానికి తారక్ ఫ్యామిలి నుంచి కాని హరికృష్ణ కుటుంబం నుంచి కాని ఎటువంటి అధికారిక సమాచారం లేకుండానే ఇది ప్రచారం కావడంతో ఇది నిజమా అబద్దమా అనే సంశయం ఉదయం నుంచి వెంటాడుతూనే ఉంది. అసలు విషయం ఏంటంటే తారక్ సతీమణి లక్ష్మి ప్రణతికి ఇంకా డెలివరీ కాలేదు. దానికి టైం పడుతుందని డాక్టర్లు గతంలోనే చెప్పారట. ఇటీవలే అత్యంత సన్నిహితుల మధ్య శ్రీమంతం వేడుక జరిపించుకున్న జూనియర్ దంపతులు అలాంటి శుభవార్త నిజంగా ఉంటే చెప్పకుండా దాస్తారా. ఇది మెల్లగా రచ్చ అవుతుండటంతో జూనియర్ పిఆర్ క్లారిటీ ఇచ్చేసాడు.
ఇటీవలే జూనియర్ ఎన్టీఆర్ తల్లిగారు భీమవరంలోని మావూళ్ళమ్మ గుడికి వెళ్లి ప్రత్యేక పూజలు జరిపించారు. ఇంటిలోకి మరో కొత్త సభ్యులు వస్తున్న సందర్భాన్ని పురస్కరించుకుని తల్లి బిడ్డా క్షేమంగా ఉండేలా వేడుకుని వచ్చారు. ఇటు చూస్తే కనీసం నిర్ధారణ చేసుకోకుండా వార్తలు ప్రసారం చేయటం పట్ల తారక్ కాస్త అసహనం వ్యక్తం చేసినట్టు టాక్ . దీనికి కారణం సోషల్ మీడియాలో ఒకరు దీన్ని పోస్ట్ చేయటమే అని అది వైరల్ కావడంతో నిజమనుకోవడానికి అవకాశం దక్కిందని తెలిసింది. ఎంత అప్రమత్తంగా ఉన్నా కూడా ఇలాంటి తప్పుడు వార్తలను కట్టడి చేయటం ఈజీగా కనిపించడం లేదు. తారక్ రెండో సారి తండ్రి అవుతుండటం నిజం. కానీ ఇంకొంత సమయం ఉంది. ఆ లోపే ఆధారం లేని వార్తను నమ్మి ప్రచారం చేయటం మాత్రం తప్పే. అంతా సోషల్ మీడియా మహత్యం.