ఎన్టీఆర్ తెలిసి తెలిసి ఆ త‌ప్పు చేయ‌డుగా?

Update: 2022-08-23 05:50 GMT
ద‌ర్శ‌క‌ధీరుడు రాజ‌మౌళి అత్యంత ప్ర‌తిష్టాత్మ‌కంగా తెర‌కెక్కించిన 'RRR' మూవీ దేశ వ్యాప్తంగానే కాకుండా ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాలు సృష్టించింది. మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌, యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ క‌లిసి న‌టించిన ఈ మూవీ ఇండియ‌న్ బాక్సాఫీస్ వ‌ద్ద రికార్డు స్థాయి వ‌సూళ్ల‌ని రాబ‌ట్టింది. ఫ్రీడ‌మ్ ఫైట‌ర్స్ అల్లూరి సీతారామ‌రాజు, కొమురం భీంల ఫిక్ష‌న‌ల్ స్టోరీగా 1920లో జ‌రిగిన క‌థ‌గా ఈ మూవీని అత్యంత భారీ స్థాయిలో ప్రీ ఇండిపెండెన్స్ నేప‌థ్యంలో సాగే ఫిక్ష‌న‌ల్ డ్రామాగా తెర‌కెక్కించారు.

ఈ మూవీతో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్, మెగా ప‌వ‌ర్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ ఒక్క‌సారిగా పాన్ ఇండియా స్టార్స్ గా మారిపోయారు. మునుప‌టికి మించి దేశ వ్యాప్తంగా భారీ క్రేజ్ ని సొంతం చేసుకున్నారు. హాలీవుడ్ స్టార్స్ తో పాటు విదేశీ సినీ ప్రియులు కూడా ఈ మూవీపై ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు. ఆస్కార్ బ‌రిలోనూ ఈ మూవీ నిల‌వ‌నుంద‌నే వార్త‌లు వినిపిస్తున్నాయి. అందులో యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ ఆస్కార్ కి నామినేట్ అయ్యే అవ‌కాశాలు వున్నాయ‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది.

ఈ నేప‌థ్యంలో రెండు రోజుల క్రితం కేంద్ర హోంమ‌త్రి అమిత్ షా ప్ర‌త్యేకంగా యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ తో భేటీ కావ‌డం తెలిసిందే. ఆదివారం రాత్రి 10:30 గంట‌ల‌కు నోవాటెల్ హోట‌ల్ లో ప్ర‌త్యేకంగా భేటీ అయ్యారు. ఆర గంట పాటు సాగిన వీరి భేటీలో ప‌లు విష‌యాలు చ‌ర్చించుకున్నార‌ని  వార్త‌లు వినిపించాయి. భేటీ అనంత‌రం అమిత్ షా తో క‌లిసి భోజ‌నం చేసిన ఎన్టీఆర్ రాత్రి 11:10 నిమిషాల‌కు అక్క‌డి నుంచి ఇంటికి వెళ్లిపోయారు.

భేటీ అనంత‌రం 'అత్యంత ప్ర‌తిభావంతుడైన న‌టుడు, తెలుగు సినిమా తార‌క‌మంత్రం జూనియ‌ర్ ఎన్టీఆర్ ను ఈ రోజు హైద‌రాబాద్ లో క‌లుసుకోవ‌డం ఆనందంగా వుంది' అంటూ అమిత్ షా ట్వీట్ చేశారు.  దీంతో ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో రాజ‌కీయ వేడ మొద‌లైంది. అమిత్ షా హీరో ఎన్టీఆర్ ని ప్ర‌త్యేకంగా ఎందుకు క‌లిశారు. ఆర గంట పాటు జ‌రిగిన వీరి భేటీలో ఏఏ అంశాలు ప్ర‌ధాన చ‌ర్చ‌కు వ‌చ్చాయి? .. అస‌ల ఏం చేయ‌బోతున్నారు? ఉభయ‌ తెలుగు రాష్ట్రాల్లో అమిత్ షా ఎలాంటి ఎత్తుగ‌డకు తెర‌లేపాల‌ని ప్లాన్ చేస్తున్నారు? అంటూ భిన్న‌మైన క‌థ‌నాలు పుట్టుకొచ్చాయి.

అయితే భేటీ అనంత‌రం తెలంగాణ బీజేపీ అధ్య‌క్షుడు బండి సంజ‌య్ మాట్లాడుతూ అమిత్ షా, ఎన్టీఆర్ భేటీపై వివ‌ర‌ణ ఇచ్చాడు. 'RRR' సినిమాలో అత్యుత్త‌మ‌యైన న‌ట‌న‌ని ప్ర‌ద‌ర్శించిన జూనియ‌ర్ ఎన్టీఆర్ ను అభినందించేందుకే ఈ భేటీ జ‌రిగింద‌ని, దీనికి ఎలాంటి రాజ‌కీయ ప్ర‌ధాన్య‌త లేద‌ని స్ప‌ష్టం చేశారు. అయినా స‌రే ఈ భేటీలో దుమారం రేగుతూనే వుంది. అయిఒతే ఈ సంద‌ర్భంగా బండి మాట్లాడిన త‌రు మాత్రం ప‌లువురిలో అనుమానాల్ని రేకెత్తిస్తోంది.

ఎన్టీఆర్ ని ప్ర‌త్యేకంగా అమిత్ షా క‌ల‌వ‌డం బండికి పెద్ద‌గా ఇష్టం లేనట్లుగా క‌నిపించింది. గ‌తం తాలూకూ అనుభ‌వాల‌ని దృష్టిలో పెట్టుకుని యంగ్ టైగ‌ర్ ఎన్టీఆర్ మ‌ళ్లీ రాజకీయాల్లోకి ఎంట్రీ ఇవ్వ‌డ‌, కెరీర్ పీక్ స్టేజ్ లో వున్న ఈ త‌రుణంలో మ‌ళ్లీ అలాంటి త‌ప్పు చేయ‌డ‌ని అంతా అంటున్నారు.
Tags:    

Similar News