సినీ ప్రపంచం మొత్తం పాన్ ఇండియా అనే పాయింటు చుట్టూ తిరుగుతోంది. దాంతో పెద్ద సినిమాలని వేర్వేరు భాషలకు సంభందించిన ఆర్టిస్ట్ లతో నింపుతున్నారు. బిజినెస్ వైజ్ గా చూస్తే అన్ని భాషల్లో సినిమాని మార్కెట్ చేసుకోవడానికి అదో చక్కటి మార్గం కూడా. ఇక ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరో సినిమా అంటే..ఇంక చెప్పేదేముంది. మామూలుగానే మన డైరక్టర్స్ .. చిన్న చిన్న పాత్రలకు సైతం.. పేరున్న ఆర్టిస్టులనే తీసుకువస్తారు. ఎన్టీఆర్ - కొరటాల శివ సినిమాలోనూ అదే స్కీమ్ ఫాలో కాబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రస్తుతం `ఆర్.ఆర్.ఆర్`తో ఎంగేజ్ అయి ఉన్న ఎన్టీఆర్ ఆ వెంటనే కొరటాల శివతో ఓ సినిమా చేయబోతున్నారు. వీరి కాంబోలో ఇంతకు ముందు వచ్చిన 'జనతా గ్యారేజ్' సినిమా ఎన్టీఆర్ కెరీర్‌లోనే పెద్ద హిట్ గా నిలిచింది. ఈ నేపధ్యంలో #NTR30 వర్కింగ్ టైటిల్ గా రానున్న ఈ సినిమాపై అభిమానుల్లో ఎక్సపెక్టేషన్స్ భారీగానే నెలకొన్నాయి. ఈ మూవీని ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్‌పై కళ్యాణ్‌రామ్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాలో మలయాళం మెగాస్టార్ మమ్ముట్టిని ఓ కీలక పాత్రలో కోసం సంప్రదించినట్లు టాక్ వినిపిస్తోంది.
జనతా గ్యారేజ్ లో మోహన్ లాల్ ని తీసుకొచ్చారు కొరటాల శివ. సినిమాకు ఆ పాత్రతో హుందాతనం,క్రేజ్ వచ్చింది. అందుకే ఇప్పుడు కూడా అలాంటి ఓ ఆలోచనతోనే మమ్ముట్టిని తీసుకురాబోతున్నాడని చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించి చర్చలు జరుగుతున్నాయని, త్వరలోనే ఈ విషయమై ఓ అధికారిక ప్రకటన రావొచ్చని ప్రచారం జరుగుతోంది. అయితే ఇది మీడియా..జనతాగ్యారేజ్ ని పెట్టుకుని మీడియా వండినా వార్తా,లేక నిజమేనా అనేది తెలియాల్సి ఉంది.