యంగ్ టైగర్ ఎన్టీఆర్- స్టార్ డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ `జనతా గ్యారేజ్` తో బ్లాక్ బస్టర్ అందుకున్న సంగతి తెలిసిందే. ఈ కాంబినేషన్ రెండో సినిమాని ప్రకటించింది. ప్రకటన వచ్చిన నాటి నుంచి అభిమానుల్లో అంచనాలు స్కైని టచ్ చేస్తున్నాయి. `ఆర్.ఆర్.ఆర్`తో ఎన్టీఆర్ పాన్ ఇండియా స్టార్ గా సంచలనాలు సృష్టిస్తున్న నేపథ్యంతో కొరటాలతో మూవీ అత్యంత ప్రతిష్ఠాత్మకంగా మారింది. ఆగస్టు లో ఈ సినిమా లాంచ్ చేయాలని కొరటాల అండ్ టీమ్ సన్నాహాలు చేస్తోంది. తాజాగా ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలు బయటకొచ్చాయి.
ఈ సినిమాని మారిన సన్నివేశంలో కచ్ఛితంగా పాన్ ఇండియా కేటగిరీలోనే తీర్చిదిద్దేందుకు ఆస్కారం ఉందని తెలిసింది. ఇందులో బహుభాషా నటీనటులను ఎంపిక చేసుకునేందుకు కొరటాల ప్రాధాన్యతనివ్వనున్నారు. రిలీజ్ కూడా పాన్ ఇండియా కేటగిరీలోనే ఉంటుందని తెలుస్తోంది. కొరటాల ఎంపికలు ఆ దిశగానే సాగుతున్నాయట.
ఇప్పటికే ఓ కీలకమైన పాత్రలో సంపత్ రాజ్ ని ఫైనల్ చేశారు. గతంలో కొరటాల ప్రాజెక్ట్ ల్లో సంపత్ రాజ్ కీలక పాత్రలో నటించిన సంగతి తెలిసిందే. `మిర్చి`లో మెయిన్ విలన్ గా భారీ డైలాగులు.. యాక్షన్ సన్నివేశాల్లో అతడు ఆకట్టుకుకున్నారు. అలాగే `శ్రీమంతుడు` లో మినిస్టర్ తమ్ముడి పాత్రలోనూ సంపత్ రాజ్ పాత్ర హైలైట్ గా నిలిచింది. ఈ నేపథ్యంలో ఎన్టీఆర్ సినిమాలోనూ ఆ తరహా రోల్ అయితే హైలైట్ అవుతుందనే భావిస్తున్నారట.
అలాగే ఓ బాలీవుడ్ నటుడు కూడా ఈ సినిమాలో భాగం అవుతున్నారు. ఆ పాత్రకు చాలా ప్రాధాన్యత ఉంటుందని టాక్. మరి బహుభాషా తారల ఎంపిక ఉన్న మతలబు ఏమిటన్నది? కొరటాల స్వయంగా వెల్లడిస్తారేమో చూడాలి.
ప్రస్తుతం ఎన్టీఆర్- కొరటాల వేర్వేరు సినిమాలతో బిజీగా ఉన్నారు. ఎన్టీఆర్ `ఆర్.ఆర్.ఆర్` పాటల చిత్రీకరణకు రెడీ అవుతున్నారు. ఉక్రెయిన్ లో పాటల చిత్రీకరణ పూర్తి చేసుకుని డబ్బింగ్ పనుల్లో బిజీ కానున్నారు. అనంతరం ఎన్టీఆర్ ఫ్రీ అయిపోతారు. అటు కొరటాల కూడా మెగాస్టార్ చిరంజీవితో `ఆచార్య` పెండింగ్ చిత్రీకరణ పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే చాలా భాగం షూటింగ్ కూడా పూర్తయింది. సాధ్యమైనంత తొందర్లోనే తారక్ - కొరటాల భారీ చిత్రం సెట్స్ పైకి వెళ్లనుంది. ఇక ఈ మూవీ కాన్సెప్ట్ ఏమిటన్నదానిపైనా కొరటాల బృందం వెల్లడిస్తుందేమో చూడాలి.
తారక్ ఆర్.ఆర్.ఆర్ తర్వాత కొరటాలతో సినిమా చేస్తారు. ఇది పాన్ ఇండియా కేటగిరీ లో ఉంటేనే ఆ తర్వాత కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్ నీల్ తో సినిమాకి హైప్ పెరుగుతుంది. మార్కెట్లో మారిన ట్రెండ్ ను అనుసరించి తారక్ కి భారీ ఆదాయ ఆర్జనకు ఆస్కారం ఉంటుందని భావిస్తున్నారు. ప్రస్తుతం హీరోలంతా పారితోషికం ప్లస్ భారీ ప్యాకేజీలు అందుకుంటున్నారు. అందుకే ఈసారి తారక్ ఫేజ్ కూడా అమాంతం మారిపోనుందని గుసగుసలు వినిపిస్తున్నాయి.
ప్రభాస్ ఇప్పటికే పాన్ ఇండియా బరిలో పెద్ద స్టార్ గా అవతరించారు. చరణ్ - బన్ని- మహేష్ దానిని అందుకోవాలని తపిస్తున్నారు. సీనియర్స్ లో చిరంజీవి- పవన్ వంటి స్టార్లు కూడా తమను తాము పాన్ ఇండియా కేటగిరీలో పెద్ద స్థాయిలో ఎలివేట్ చేసుకునేందుకు తపిస్తున్న తీరు ఉత్కంఠను పెంచుతోంది. ప్రస్తుతం స్టార్లంతా పాన్ ఇండియా సినిమాలు చేస్తున్న తరుణంలో తారక్ కూడా వరుసగా తన దర్శకులు ఆ రేంజులోనే ఉండేలా ప్లాన్ చేస్తున్నారు.