తెలుగులో పెద్దగా కనిపెట్టలేం కానీ... ఆంగ్లంలో మాత్రం కొందరి పేర్లలో స్పెల్లింగులు తేడాగా ఉంటాయ్. ఒక ఏ అక్షరం పెట్టాల్సిన చోట రెండు ఏలు కనిపిస్తాయి. అవసరం లేకపోయినా... మధ్యలో ఓ అక్షరాన్ని చేరుస్తారు. అలా జాతకం ప్రకారం కొన్నిఅక్షరాలను చేర్చడం లేదా తొలగించడం చేస్తే లక్కు కలిసొస్తుందన్న నమ్మకం ఉంది ప్రజల్లో. అందులోనూ సినిమావారిలో ఈ పిచ్చి మరింత ఎక్కువే. అందుకే ఎంతో మంది హీరోయిన్లు, హీరోలు, దర్శకులు తమ పేరులో స్పెల్లింగులు మార్చకున్నారు. సొంత పేర్లు మార్చుకోవడంలో అర్థముంది కానీ... అదేంటో ఈ మధ్య సినిమా పేర్లు కూడా మార్చేస్తున్నారు.
పవన్ కళ్యాణ్ తాజా ఫ్లాఫ్ అజ్ఞాతవాసి (Agnyaathavaasi), అనుష్క రాబోయే సినిమా భాగమతి (Bhaagamathie), వివాదాలకు కేరాఫ్ అడ్రస్‌గా మారిన పద్మావత్ (Padmaavat)... సాయిదరమ్ కొత్త సినిమా ఇంటిలిజెంట్ (Inttelligent).. ఈ సినిమాల ఆంగ్ల స్పెల్లింగులు చూడండి.. అనవసర అక్షరాలు కనిపిస్తాయ్. భాగమతి స్పెల్లింగులో చివరన ఈ అక్షరం పెట్టాల్సిన అవసరమేముంది? ఇంటిలిజెంట్లో ఒక టి ఎక్కువగా ఉంది. ఎందుకూ అంటారా? అదేనండి న్యూమరాలజీ మహిమ. సినిమా హిట్ కొట్టించడానికే శుభసూచకంగా ఇలా అక్షరాలను యాడ్ చేశారట నిర్మాతలు. సినిమా దర్శక నిర్మాతలు హిట్టు వస్తుందనే ఆశతో ఇలాంటి విషయాలను చాలా గట్టిగానే పట్టించుకున్నట్లున్నారు.
నిజానికి సినిమాలో కంటెంట్ లేనప్పుడు న్యూమరాలజీ మాత్రం ఏం చేస్తుందిలెండి. విషయం ఉన్న సినిమాలకు ఏ పేరు పెట్టిన చూస్తారు. ఆ మధ్యన 'బిచ్చగాడు' అని పేరు పెడితే మనోళ్ళు చూసెయ్యలేదు? సినిమా కంటెంట్ నచ్చింది కాబట్టి సూపర్ హిట్ చేసిపాడేశారు.