తెలుగు చలనచిత్ర సీమలోని దిగ్గజ దర్శకులలో ఒకరైన దాసరి నారాయణరావుపై త్వరలో ఓ బయోపిక్ రానుంది. దర్శక రత్నదాసరి జీవిత చరిత్రను తెరకెక్కించేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ బయోపిక్ పై నటుడు, ఫిలిం ఫెడరేషన్ మాజీ అధ్యక్షుడు ఓ.కళ్యాణ్ ఓ ప్రకటన చేశారు. ఈ విధంగా తన గురువుగారైన దాసరికి ఘన నివాళి ఇస్తున్నట్లు ఆయన ప్రకటించారు.
ఈ సినిమాలో దాసరి సినీ, రాజకీయ జీవితాన్ని ప్రస్థావించనున్నారు. ఆయన కెరీర్ లో సాధించిన విజయాలు, పరాజయాలు, ఆ ప్రయాణంలో ఆయన ఎదుర్కొన్న ఇబ్బందులను కూడా ఈ సినిమాలో చూపించబోతున్నారు. దాసరి శిష్యుల్లోని ఓ ప్రముఖ దర్శకుడు ఈ సినిమాకు దర్శకత్వం వహించే అవకాశం ఉందని కల్యాణ్ తెలిపారు. ఈ సినిమాలో నటించబోయే నటీనటులు, సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడించనున్నారు.
దాసరి నారాయణ రావు ఎంతో మంది ప్రతిభ ఉన్ననటీనటులను తెలుగు చలన చిత్రసీమకు పరిచయం చేశారు. ఓ.కల్యాణ్‌ను దాసరి నారాయణరావు టాలీవుడ్ కు పరిచయం చేశారు. దాసరి నారాయణ రావు మృతి తెలుగు సినీ పరిశ్రమకు తీరని లోటని కల్యాణ్ అన్నారు. ఆ బయోపిక్ ను తెరకెక్కించి తమ గురువుగారి రుణాన్ని తీర్చుకుంటామని చెప్పారు.