ఓబులమ్మ మనకి మరింత దూరం.. అక్కడే పది!

Update: 2022-02-05 00:30 GMT
2009 సంవత్సరంలో కన్నడ మూవీ గిల్లీ సినిమాతో హీరోయిన్‌ గా పరిచయం అయిన రకుల్‌ ప్రీత్‌ సింగ్ టాలీవుడ్ లో టాప్ స్టార్‌ హీరోయిన్‌ గా దాదాపు టాప్‌ హీరోలు అందరితో సినిమాలు చేసింది. 2011 లో కెరటం సినిమా తో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన రకుల్‌ ప్రీత్‌ సింగ్ ఆ తర్వాత వరుసగా తమిళం మరియు తెలుగు సినిమాలు చేస్తూ వచ్చింది. తెలుగు లో రకుల్‌ కు మొదటి బ్రేక్ 2013 లో వెంకటాద్రి ఎక్స్‌ ప్రెస్ సినిమాతో దక్కింది. ఆ తర్వాత కూడా హిందీ తమిళ సినిమాల్లో నటిస్తూ వచ్చింది. బ్యాక్ టు బ్యాక్‌ తెలుగు లో నటిస్తూ రామ్ చరణ్‌ తో బ్రూస్లీ సినిమాలో నటించి స్టార్‌ హీరోయిన్‌ గా మారిపోయింది. ఆ సినిమా ఫలితం బెడిసి కొట్టినా కూడా రకుల్‌ జోరు మాత్రం ఆగలేదు. 2014 మొదలుకుని 2017 వరకు వరుసగా టాలీవుడ్ స్టార్‌ హీరోల సినిమాల్లో నటిస్తూ టాప్‌ స్టార్‌ హీరోయిన్ గా మోస్ట్‌ వాంటెడ్‌ హీరోయిన్‌ గా మారిపోయింది.

2018 నుండి ఈమె కు తెలుగు సినిమా ఇండస్ట్రీలో అవకాశాలు మెల్ల మెల్లగా తగ్గుతూ వచ్చాయి. అదే సమయంలో ఈ అమ్మడు బాలీవుడ్‌ పై ఎక్కువ దృష్టి పెట్టింది. తమిళ సినిమాలు చేస్తూ తెలుగు లో అవకాశాల కోసం చూస్తూ హిందీలో వరుసగా చిన్న సినిమాలను చేస్తూ వచ్చింది. అక్కడ మెల్ల మెల్లగా స్టార్‌ డమ్‌ దక్కించుకుంది. ప్రస్తుతం అక్కడ వరుసగా సినిమాలను చేస్తోంది. తెలుగు లో రకుల్‌ ప్రీత్‌ నటించిన చివరి సినిమా కొండపొలం. ఆ సినిమా విడుదల తర్వాత తెలుగు లో మళ్లీ ఏ సినిమా ను ఆమె కమిట్‌ అవ్వలేదు. చిన్నా చితకా ఆఫర్లు వస్తున్నా కూడా నో చెప్పినట్లుగా సమాచారం అందుతోంది. హిందీలో ప్రస్తుతం రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది సినిమాలు చేస్తుంది. ఆ సినిమాలు వివిధ దశలో ఉన్నాయి. కొన్ని సినిమాలు షూటింగ్‌ పూర్తి చేసుకుని విడుదలకు సిద్దంగా ఉండగా.. కొన్ని షూటింగ్‌ దశలో ఉన్నాయి మరి కొన్ని చర్చల దశలో ఉన్నాయి.

ఇటీవలే రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మొదటి లేడీ ఓరియంటెడ్‌ హిందీ సినిమాకు కమిట్‌ అయ్యిందని బాలీవుడ్‌ వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. దినేష్‌ జైన్‌ బ్యానర్ లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ హిందీ సినిమా ఉండబోతున్నట్లుగా తెలుస్తోంది. ఇప్పటి వరకు హీరోలకు జోడీగా నటించి హిందీ ప్రేక్షకులను ఎంటర్‌ టైన్ చేసిన రకుల్‌ ప్రీత్‌ సింగ్ మొదటి సారి లేడీ ఓరియంటెడ్‌ సినిమాను చేస్తుంది. హిందీ ప్రేక్షకులు లేడీ ఓరియంటెడ్‌ సినిమాలను ఎక్కువగా ఆధరిస్తారు. అందుకే రకుల్‌ ఈ సినిమా తో బాలీవుడ్‌ లో మరింత గా పాతుకు పోవడం ఖాయం అనిపిస్తుంది. అందుకే కొండ పొలం చేసిన ఓబులమ్మ అలియాస్ రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మనకు మరింత దూరం అవ్వబోతుంది. ఒక వేళ ఆమె చేసిన సినిమాలు హిట్‌ అయితే తెలుగు లో క్రేజ్ ఉంది కనుక ఇక్కడ కూడా డబ్బింగ్‌ చేసే అవకాశాలు లేకపోలేదు. రకుల్‌ కనీసం డబ్బింగ్‌ సినిమాలతో అయినా తెలుగు ప్రేక్షకులకు టచ్‌ లో ఉండాలని అభిమానులు కోరుకుంటున్నారు.
Tags:    

Similar News