చిత్రం : ఓదెల రైల్వేస్టేషన్
నటీనటులు : హెబ్బా పటేల్, పూజితా పొన్నాడ, వశిష్ట ఎన్. సింహా, సాయి రోనక్ తదితరులు నటించారు.
సంగీతం : అనూప్ రూబెన్స్
ఛాయాగ్రహణం : సౌందర్ రాజన్ .ఎస్
ఎడిటింగ్ : తమ్మిరాజు
నిర్మాత : కె.కె. రాధామోహన్
కథ : సంపత్ నంది (డైరెక్టర్)
దర్శకత్వం : అశోక్ తేజ
స్ట్రీమింగ్ : ఆహా ఓటీటీ
యధార్థ సంఘటనల ఆధారంగా బాలీవుడ్ లో సైకో పాత్ కిల్లర్ స్టోరీస్ చాలా వరకు వస్తున్నాయి. చాలా వరకు సక్సెస్ అవుతున్నాయి కూడా. అదే పంథాలో ఓదెలలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా సైకో కిల్లర్ కథతో రూపొందిన మూవీ `ఓదెల రైల్వే స్టేషన్`. `కుమారి 21 ఎఫ్` సినిమాతో తెలుగు ప్రేక్షకులకు చేరువైన హెబ్బా పటేల్ ఆ తరువాత కొన్ని సినిమాల్లో మెరిసినా ఇటీవల తన జోరుని చూపించలేకపోతోంది. అయినా సరే తన వరకు వచ్చిన ఆఫర్ ని కాదనకుండా అంగీకరిస్తూ ఇండస్ట్రీలో నెట్టుకొస్తోంది. ఐటం సాంగ్ ల వరకు వెళ్లిన హెబ్బా `ఓదెల రైల్వే స్టేషన్` సినిమాతో మళ్లీ ట్రాక్ లోకి రావాలనుకుంటోంది. శుక్రవారం నుంచి `ఆహా` ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతున్న `ఓదెల రైల్వేస్టేషన్` ఎలా వుంది? చాలా కాలంగా రిలీజ్ వాయిదా పడుతూ వచ్చిన ఈ సైకో థ్రిల్లర్ ఆకట్టుకుందా? లేదా అన్నది తెలియాలంటే కథలోకి వెళ్లాల్సిందే.
కథ:
తెలంగాణలోని ఓదెల గ్రామం. రాధా (హెబ్బా పటేల్), తిరుపతి (వశిష్ణ ఎన్. సింహా) భార్య భర్తలు. ఊళ్లో వాళ్ల బట్టలు ఉతికి ఇస్త్రీ చేస్తే వచ్చే డబ్బులతో జీవితం సాగిస్తూ వుంటారు. తిరుపతి తాగుడుకు బానిస.. అది భరించలేక రాధా నిత్యం గొడవ పడుతూ వుంటుంది. మాటంటే పడదు. సొంతం కష్టంపైనే ఆధారపడి నిజాయితీగా బ్రతకాలన్నది రాధ ఆలోచన. కానీ తిరుపతి అలా కాదు.. ఎక్కడా తేరగా వస్తే అక్కడ నొక్కేయ్యాలనే టైపు. ఇదే ఇద్దరి మధ్య నిత్యం గొడవలకు కారణం అవుతూ వుంటుంది. ఇదే క్రమంలో శోభనం జరిగిన మరుసటిరోజునే మాధవిని రేపు చేసి హత్య చేస్తారు. పోలీసుల టార్చర్ తట్టుకోలేక మాధవిని ప్రేమించిన వివేక్ నేనే తనని హత్య చేశానని అంగీకరిస్తాడు. అయినా సరే వరుసగా పెళ్లైన యువతుల హత్యలు జరుగుతూనే వుంటాయి. పోలీస్ అధికారి అనుదీప్ (సాయి రోనక్) 2019 యుపీ ఎస్ ఈ లో టాపర్. ఐఏఎస్ కి బదులుగా ఐపీఎస్ ని సెలెక్ట్ చేసుకుంటాడు. తెలంగాణ క్యాడర్ కు సెలెక్ట్ అయ్యాక రెండు నెలల ట్రైనింగ్ కోసం ఓదెల గ్రామానికి వస్తాడు. స్ఫూర్తి (పూజితా పొన్నాడా) ని పెళ్లి చేసుకోవాలనుకుంటాడు. ఈ క్రమంలో రాధా ఓ వ్యక్తి తల నరికి స్టేషన్ లో సరెండర్ అవుతుంది. ఇంతకీ ఓదెలలో వరుస హత్యలు చేస్తున్న ఆ సైకో కిల్లర్ ఎవరు? రాధ తెచ్చిన తల ఎవరిది అన్నదే అసలు కథ.
కథ,విశ్లేషణ:
సీరియల్ సైకో కిల్లర్ కథలతో ఇంత వరకు చాలానే వెబ్ సిరీస్ లు, సినిమాలు వచ్చాయి. అందులో చాలా వరకు ఆకట్టుకున్నాయి కూడా. అనుక్షణం ఉత్కంఠభరితంగా సాగుతూ సీట్ ఎడ్జ్ థ్రిల్లర్స్ గా ప్రేక్షకుల్ని భయపెడుతూనే ఎంటర్ టైన్ చేశాయి. ఓ ఊరిలో సైకో కిల్లర్ చేసే వరుస హత్యల నేపథ్యంలో `ఓదెల రైల్వే స్టేషన్`ని తెరకెక్కించారు. దీనికి దర్శకుడు సంపత్ నంది కథ అందించాడు. కొన్నేళ్ల క్రితం ఓదెలలో జరిగిన యదార్ధ సంఘటనల ఆధారంగా రాసుకున్న కథ ఇది అని తెలుస్తోంది. కానీ ఏ విషయంలోనూ గతంలో వచ్చిన సైకో థ్రిల్లర్ ల టెంపోని కానీ, కథ, కథనాలని కానీ ఈ మూవీ మ్యాచ్ చేయలేకపోయింది. హెబ్బా పటేల్, వశిష్ణ ఎన్. సింహా మధ్య వచ్చే సన్నివేశాలు కూడా ఏమంతగా ఆసక్తికరంగా అనిపించవు.
సైకో కిల్లర్ ఎవరు? అనే ఉత్కంఠ ఏ సీన్ లోనూ పెద్దగా కనిపించదు. చూసే ఆడియన్ కు ఓ బీగ్రేడ్ సినిమాలా కనిపిస్తుంది. సైకో పెళ్లై శోభనం పూర్తి చేసుకున్న అమ్మాయిలనే టార్గెట్ చేస్తూ కిడ్నాప్ చేసి దారుణంగా అత్యాచారం, హత్య చేస్తుంటాడు. దీనికి చూపించిన లాజిక్ కానీ, సైకో ని చూపించిన సన్నివేశాలు కానీ ఏమంతగా ఆకట్టుకునే విధంగా లేకపోవడం `ఓదెల రైల్వే స్టేషన్`కు ప్రధాన మైనస్ గా మారింది. సాయి రోనక్ ఇందులో వరుస హత్యల వెనకున్న సైకో కిల్లర్ ని పట్టుకునే ట్రైనీ పోలీస్ ఆఫీసర్ పాత్రలో కనిపించాడు. అతనికి జోడీగా పూజితా పొన్నాడా నటించింది. ఈ ఇద్దరు సైకోని పట్టుకోవడం కోసమే పెళ్లి చేసుకోవడం.. శోభనం తరువాత సైకో ఎలాగైనా తన కోసం వస్తాడని పూజిత చెప్పడం.. ప్రియురాలిని పణంగా పెట్టి సైకో కు ఉచ్చుబిగించాలని సాయి రోనక్ అనుకుని తనని రిస్క్ లో పెట్టడం చాలా సిల్లీగా వుంది. ఇక రచ్చా, గౌతమ్ నంద, బెంగాల్ టైగర్, సీటీమార్ లాంటి సినిమాల దర్శకుడు సంపత్ నంది ఇంత పేలవమైన కథని అందిస్తాడని ఎవరూ ఊహించరు. ఇక దర్శకుడు అశోక్ తేజ్ పనితనం గురించి కూడా చెప్పుకోవడానికి ఏమీ లేదు. దర్శకుడిగా తన పనితనం ఏ సన్నివేశంలోనూ కనిపించలేదు.
నటీనటుల నటన:
హెబ్బా పటేల్ ని ఈ పాత్రకు ఎందుకు తీసుకున్నారో సంపత్ నంది, నిర్మాత కె. కె. రాధామోహన్ కైనా అర్థం అవ్వాలి. వశిష్ణ ఎన్. సింహా కు కూడా నటించడానికి పెద్దగా ఎక్కడా స్కోప్ కనిపించలేదు. క్లైమాక్స్ లో తప్ప. హెబ్బా పటేల్ పరిస్థితి కూడా అలాగే వుంది. చాలా రోజుల తరువాత ఈ మూవీతో తనకు మళ్లీ మంచి రోజులొస్తాయని హెబ్బా పటేల్ అంగీకరించి వుండవచ్చు. కానీ ఆ అవకాశం ఎక్కడా కనిపించలేదు. డీ గ్లామర్ పాత్రలో తనని చూపించినా నటనకు పెద్దగా స్కోప్ లేని పాత్ర కావడంతో తన వంత ఎంత వరకు న్యాయం చేయాలో అంత వరకు చేసింది. పోలీస్ ఆఫీసర్ గా సాయి రోనక్, అతని ప్రియురాలిగా పూజితా పొన్నాడా నటించారు. క్లైమాక్స్ లో తప్ప పూజిత కు కూడా పెద్దగా స్కోప్ కనిపించలేదు. ఈ జంట మధ్య లవ్ స్టోరీని ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ తో చెప్పి వుంటే కొంత వరకైనా ఆసక్తిని రేకెత్తించేదేమో. మిగతా పాత్రల్లో చెప్పుకోదగ్గ ఆర్టిస్ట్ లు ఎవరూ లేరు. ఒక్క సర్పంచ్ మహేందర్ రెడ్డి, ఎస్ ఐ పాత్రల్లో నటించిన వాళ్లు తప్ప.
సాంకేతిక వర్గం:
సైకో పాథ్ థ్రిల్లర్ లకు బ్యాగ్రౌండ్ స్కోర్ మెయిన్. ఈ మూవీకి అనూప్ రూబెన్స్ సంగీతం అందించాడు. తన లాంటి మ్యూజిక్ డైరెక్టర్ వున్నా కూడా ఆయనని దర్శకుడు సరైన విధంగా ఉపయోగించుకోలేకపోయాడు. నేపథ్య సంగీతంతో కట్టిపడేస్తూ ఉత్కఠత రేకెత్తించడంలో సంగీత దర్శకుడే ఇలాంటి సినిమాలకు ప్రధాన బలం. టైటిల్ కార్డ్స్ లో చూపించిన కేర్ .. సినిమా నేపథ్య సంగీతం విషయంలో చూపించలేకపోయారు. కథ, కథనాల్లో దమ్ము లేకపోవడం, దర్శకుడు తన నుంచి కావాల్సిన ఔట్ పుట్ ని రాబట్టలేకపోవడంతో అనూప్ కూడా ఏమీ చేయలేకపోయాడు. సంపత్ నంది అందించిన కథలో కొంత డ్రామాని, ఎగ్జైటింగ్ అంశాలని జోడించి వుంటే బాగుండేదేమో.. కానీ అది జరక్క పోవడంతో దర్శకుడు కూడా తన వంతు బాధ్యతని మరిచి తను చెప్పింది చెప్పినట్టే చేస్తూ వెళ్లినట్టుగా కనిపించింది. దీంతో ఇంట్రెస్టింగ్ గా సాగాల్సిన సైకో థ్రిల్లర్ కాస్తా టార్చర్ మూవీగా మారింది.
రేటింగ్ - 1.5/5
Disclaimer : This Review is Just An Opinion of One Person. Please Do Not Judge The Movie Based On This Review And Watch Movie in Aha OTT