అఫిషియల్‌ గా ప్రకటించేసిన 'ఎఫ్‌ 2' టీం

Update: 2019-01-25 12:18 GMT
సంక్రాంతి సందర్బంగా ప్రేక్షకుల ముందుకు వచ్చిన 'ఎఫ్‌ 2' చిత్రం అనూహ్యంగా భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. దిల్‌ రాజు బ్యానర్‌ నుండి వస్తుంది కనుక, అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో సినిమా కనుక ఎంటర్‌ టైనింగ్‌ గా ఉంటుందని అంతా భావించారు. అయితే సంక్రాంతికి విడుదలైన వినయ విధేయ రామ మరియు ఎన్టీఆర్‌ కథానాయకుడు, పేట చిత్రాల ముందు ఇది నిలుస్తుందా అనే అనుమానాలు వ్యక్తం అయ్యాయి. కాని ఆ మూడు సినిమాల కంటే కూడా అధికంగా ఎఫ్‌ 2 చిత్రం వసూళ్లు దక్కించుకుంది.

మూడవ వారంలో ఈ చిత్రం వంద కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ ను సాధించింది. వంద కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ నమోదయ్యాయంటూ చిత్ర నిర్మాణ సంస్థ శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ అధికారికంగా ప్రకటించింది. మూడవ వారంలోనే వంద కోట్లు వసూళ్లు చేయడం మామూలు విషయం కాదు. వెంకటేష్‌ మరియు వరుణ్‌ తేజ్‌ ల కెరీర్‌ లో ఇదే బెస్ట్‌ సినిమాగా నిలిచిందని చెప్పుకోవచ్చు. వెంకటేష్‌, వరుణ్‌ తేజ్‌ లు కలిసి పండించిన కామెడీ మరియు తమన్నా, మెహ్రీన్‌ల గ్లామర్‌ సినిమాకు హైలైట్‌ గా నిలిచాయి.

ఫ్యామిలీ ఆడియన్స్‌ ను అలరించే విధంగా ఉంటంతో పాటు, పోటీగా మరే సినిమాలు లేక పోవడంతో అక్కడ, ఇక్కడ అనే తేడా లేకుండా ఎక్కడ పడితే అక్కడ సంక్రాంతికి సందడి చేసింది. ఓవర్సీస్‌ లో కూడా ఈ చిత్రం మంచి వసూళ్లను రాబట్టి డిస్ట్రిబ్యూటర్లకు పంట పండించింది. అనీల్‌ రావిపూడి క్రేజ్‌ ఈ చిత్రంతో అమాంతం పెరిగి పోయింది. నేడు అఖిల్‌ 'మిస్టర్‌ మజ్ను' చిత్రం రాకతో ఎఫ్‌ 2 ఫన్‌ కాస్త తగ్గి ఉంటుంది. అయితే లాంగ్‌ రన్‌ లో ఈ చిత్రం 125 కోట్ల గ్రాస్‌ కలెక్షన్స్‌ ను చేరడం ఖాయం అంటూ ట్రేడ్‌ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. 
Tags:    

Similar News