ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం 'పుష్ప: ది రైజ్'. ఇది బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలవడంతో.. రెండో భాగం ''పుష్ప: ది రూల్'' సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ మూవీ ఎప్పుడెప్పుడు చూద్దామా అని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
'పుష్ప 1' సినిమా రిలీజై డిసెంబర్ నాటికి ఏడాది పూర్తవుతుంది. ఇంతవరకూ 'పుష్ప 2' రెగ్యులర్ షూటింగ్ కు సంబంధించి అధికారిక అప్డేట్ లేదు. పూజా కార్యక్రమాలు జరిపినప్పటి నుంచి త్వరలో త్వరలో అని చెప్పుకుంటూ వస్తున్నారు కానీ.. చిత్రీకరణ ప్రారంభం కాలేదు. దీంతో బన్నీ ఫ్యాన్స్ మేకర్స్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు.
మైత్రీ మూవీ మేకర్ ని ట్రోల్ చేస్తూ 'వియ్ వాంట్ పుష్ప2 అప్డేట్' అంటూ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున పోస్టులు పెడుతున్నారు. అంతేకాదు అదే హ్యాష్ ట్యాగ్ ని ఫ్లెక్సీలుగా ప్రదర్శించి నిరసనలు తెలుపుతున్నారు. తెలుగు రాష్ట్రాల్లోనే కాదు.. కేరళ - కర్ణాటక వంటి ఇతర రాష్ట్రాలతో పాటుగా దుబాయ్ ఎమిరేట్స్ లోనూ ఫ్యాన్స్ బ్యానర్లు పట్టుకొని నిలబడి నిరసనలు తెలియజేస్తున్నారు.
దీనికి సంబంధించిన ఫోటోలను అల్లు ఆర్మీ ఎప్పటికప్పుడు నెట్టింట షేర్ చేస్తున్నారు. ఈ క్రమంలో 'పుష్ప-2' సినిమా అప్‌డేట్ కావాలంటూ కొందరు అల్లు అర్జున్ అభిమానులు ఆదివారం గీతా ఆర్ట్స్ ఆఫీస్ ముందు ఆందోళనకు దిగారు. అయితే దీనిపై యాంటీ ఫ్యాన్స్ ట్రోల్ చేస్తున్నారు. నిర్మాతలు మైత్రీ మూవీస్ వారైతే.. గీతా ఆర్ట్స్ ఆఫీస్ వద్ద హంగామా చేయడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.
'పుష్ప 1' సినిమా అనూహ్య విజయం సాధించిన నేపథ్యంలో రెండో భాగాన్ని అంతకుమించి ఉండేలా రూపొందించాలని సుక్కూ అండ్ టీమ్ తీవ్రంగా కష్టపడుతోంది. దీని కోసం అనుకున్న దాని కంటే ఎక్కువ సమయం తీసుకున్నారు. మేకర్స్ ఎంత లేట్ చేసినా.. అది కేవలం ఫ్యాన్స్ అందరినీ సంతృప్తి పరిచే సినిమా ఇవ్వడానికే అని ఆలోచించాలి.
నిజానికి ఇప్పటికే 'పుష్ప 2' టీజర్ కంటెంట్ కు సంబంధించిన చిత్రీకరణ జరిగినట్లుగా సోషల్ మీడియాలో వార్తలు వస్తూనే ఉన్నాయి. డిసెంబరు 16న భారీ స్థాయిలో విడుదల కాబోతున్న 'అవతార్-2' సినిమా థియేటర్లలో దీన్ని ప్రదర్శించడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అంటున్నారు.
ఇదంతా తెలిసి కూడా కావాలనే 'పుష్ప 2' అప్‌డేట్ కావాలంటూ బన్నీ అభిమానులు హంగామా చేస్తున్నారని యాంటీ వర్గం నుంచి కామెంట్స్ వస్తున్నాయి. బన్నీ క్రేజ్ చూపించడానికి స్టంట్ లా ఉందే తప్ప.. ఈ నిరసనలో ఒరిజినాలిటీ కనిపించట్లేదని.. ఇది మరీ టూ మచ్ గా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటీవలే 'ఊర్వశివో రాక్షసివో' సక్సెస్ మీట్ లో అల్లు అర్జున్ మాట్లాడుతూ.. 'పుష్ప-1 తగ్గేదేలే.. పుష్ప-2 అస్సలు తగ్గేదేలే' అని అభిమానులను ఉత్సాహ పరిచారు. బన్నీ వాసు సైతం ఈసారి స్క్రీన్స్ పగిలిపోతాయని అన్నారు. కాబట్టి అల్లు ఆర్మీ సంయమనం పాటించి మంచి అవుట్ ఫుట్ కోసం వేచి చూడాలే తప్ప.. ఇలా ఆందోళన చేయడం సరికాదని మరికొందరు ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.