సంగీత్ శోభన్ - సిమ్రాన్ శర్మ జంటగా మహేశ్ ఉప్పాల దర్శకత్వంలో రూపొందిన కామెడీ వెబ్ సీరిస్ ''ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ''. ఇందులో సీనియర్ నరేశ్ - గీత్ సైనీ - తులసీ - రాజీవ్ కనకాల - గెటప్ శ్రీను తదితరులు ఇతర ప్రధాన పాత్రలు పోషించారు. పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ బ్యానర్ పై మెగా డాటర్ నిహారిక కొణిదెల ఈ సిరీస్ ని నిర్మించారు. ఇటీవల విడుదలైన టీజర్ మంచి రెస్పాన్స్ తెచ్చుకుంది. ఐదు ఎపిసోడ్స్ గా ఈ సిరీస్ అందుబాటులోకి రానుంది. జీ5 ఓటీటీ ఫ్లాట్ ఫార్మ్ లో 2021 నవంబర్ 19న ఈ సిరీస్ స్ట్రీమింగ్ కానుంది. ఈ నేపథ్యంలో తాజాగా కింగ్ అక్కినేని నాగార్జున ట్రైలర్ ను ఆవిష్కరించి టీమ్ మొత్తానికి శుభాకాంక్షలు తెలిపారు.
''ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'' అనేది మిడిల్ క్లాస్ బ్యాక్ గ్రౌండ్ లో చాలా సరదాగా సాగే రియలిస్టిక్ డ్రామా అని ట్రైలర్ చూస్తే అర్థం అవుతుంది. ఒక లేజీ యంగ్ మ్యాన్ లైఫ్ లో తన తండ్రి మరణంతో ఎలాంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి అనేది ఫన్నీగా చూపించారు. తండ్రి చనిపోవడానికి ముందు 25 లక్షల అప్పు తీసుకోగా.. ఆయన మరణాంతరం కొడుకు మీద రుణం చెల్లించాల్సిన బాధ్యత పడుతుంది. ఈజీ మనీ కోసం సగటు మధ్యతరగతి కుటుంబ ఆశలు.. భావోద్వేగాలు మరియు పోరాటాలు అన్నీ ఈ కథలో ఉన్నాయి. ఉద్యోగం లేని కొడుకు.. అతనిని ఎప్పుడూ కోపగించుకుంటూ ఉండే తండ్రి మరియు దెప్పి పొడిచే తల్లి.. ప్రేమించే అమ్మాయి.. ఇలా మన చుట్టూ ఉండే పాత్రలు కనిపిస్తున్నాయి. ఇవే ఈ సిరీస్ మీద ఆసక్తిని కలిగిస్తున్నాయి.
నటీనటులు తమ పాత్రలకు తగ్గట్లుగా నటించారని ట్రైలర్ చూసి చెప్పవచ్చు. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి. పికె దండి దీనికి సంగీతం సమకూర్చారు. మానసా శర్మతో కలిసి ఈ వెబ్ సిరీస్ కు మహేష్ ఉప్పాల కథ - మాటలు అందించారు. మరికొన్ని రోజుల్లో జీ5 లో రాబోతున్న ఈ సిరీస్ ఎలాంటి ఆదరణ దక్కించుకుంటుందో చూడాలి. ''ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ'' ట్రైలర్ విడుదల సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ.. 'మనందరిదీ ఒక పెద్ద ఫ్యామిలీ.. సినిమా ఫ్యామిలీ. కానీ ఈ దర్శకుడు మహేష్ ది చిన్న ఫ్యామిలీ అంట. మరి ఆ ఫ్యామిలీ ముచ్చట్లు చూడాలంటే, నవంబర్ 19 వరకూ ఎదురు ఉండాలి' అని అన్నారు.
నిర్మాత నిహారిక కొణిదెల మాట్లాడుతూ.. ''నాగార్జున గారికి చాలా చాలా థాంక్స్. మేం అడిగిన వెంటనే ఒప్పుకొన్నారు. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' ఒక ఫ్యామిలీ ఎంటర్టైనర్ సిరీస్. కామెడీ డ్రామా అని చెప్పొచ్చు. పిల్లల నుంచి పెద్దల వరకూ అందరూ నవ్వుకునేలా ఉంటుంది. 'జీ 5' లో ఈ సిరీస్ విడుదల కానుండడం ఎంతో సంతోషంగా ఉంది'' అని తెలిపారు.
Full View