అన్ని ముద్దులున్నా.. 'యు' ఇచ్చారంట

Update: 2016-06-15 15:49 GMT
మెగా బ్రదర్ నాగేంద్రబాబు కూతురు నీహారిక.. యంగ్ హీరో నాగ శౌర్య జంటగా నటించిన ఒక మనసు ఇప్పుడు రిలీజ్ కి అన్ని కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. ఇప్పటికే సిద్ధమైన కాపీనీ సెన్సార్ కు పంపగా..వారి నుంచి క్లీన్ యూ సర్టిఫికేట్ వచ్చేసిందిట. ఒక్క కట్ కూడా లేకుండా తమ చిత్రానికి సెన్సార్ పూర్తయిందని యూనిట్ వర్గాలు చెబుతున్నాయి. అయితే టీజర్ లోనే అన్ని ముద్దులుంటే సినిమాకు 'యు' ఎలా వచ్చిందో ఏంటో అనేవారూ ఉన్నారు.

'ఫ్రెండ్స్.. ఒక మనసు ఎటువంటి కట్స్ లేకుండా యు సర్టిఫికెట్ పొందిందిం. 24న విడుదలకు సర్వం సిద్ధం. మీ ఆశీర్వాదాలు కావాలి' అంటూ నిర్మాత మధుర శ్రీధర్ ట్వీట్ చేశారు. సెన్సార్ సహా అన్ని కార్యక్రమాలు పూర్తవడంతో.. ఇక ఈ నెల 24న విడుదలకు అన్ని అడ్డంకులు తొలగిపోయాయి. ఈ సందర్భంగా రిలీజ్ పోస్టర్ ను విడుదల చేసిన యూనిట్.. ఆడియన్స్ ఆశీర్వాదాలు కావాలని అంటోంది. రామరాజు దర్శకత్వంలో రూపొందిన ఈ చిత్రానికి సునీల్ కశ్యప్ సంగీతం అందించాడు.

ఈ మూవీకి సంబంధించి, నీహారికపై వస్తున్న రూమర్లకు సంబంధించి ఇప్పుడు క్లారిటీ వచ్చేసినట్లే. డబ్బింగ్ చెప్పడానికి నీహారిక రావడం లేదని.. డబ్బింగ్ ఆర్టిస్టుతో చెప్పించేందుకు నిర్మాతలు ట్రై చేస్తున్నారనే రూమర్లకు చెక్ పడినట్లే. రిలీజ్ కి 10 రోజుల ముందే సెన్సార్ ను కంప్లీట్ చేసి.. ఫైనల్ కాపి సిద్ధం చేసుకున్న ఒక మనసు యూనిట్.. ఇక ప్రమోషన్ కార్యక్రమాలపై దృష్టి పెట్టనుంది. 
Tags:    

Similar News