యంగ్ హీరో శర్వానంద్ గత కొంతకాలంగా సాలిడ్ హిట్ కోసం తీవ్రంగా కష్టపడుతున్నారు. అయినప్పటికీ నాలుగేళ్ళ క్రితం వచ్చిన ‘మహానుభావుడు’ సినిమా స్థాయి విజయాన్ని అందుకోలేకపోతున్నారు. ‘పడి పడి లేచే మనసు’ ‘రణరంగం’ ‘జాను’ వంటి హ్యాట్రిక్ ప్లాప్స్ అందుకున్న శర్వా.. ఈ ఏడాది ‘శ్రీకారం’ ‘మహాసముద్రం’ చిత్రాలతో నిరాశ పరిచారు. ఈ నేపథ్యంలో శర్వా ఆశలన్నీ రాబోయే 'ఆడవాళ్లు మీకు జోహార్లు' 'ఒకే ఒక జీవితం' సినిమాల మీదనే ఉన్నాయి.
శర్వానంద్ హీరోగా నటిస్తున్న 30వ చిత్రం ''ఒకే ఒక జీవితం''. తెలుగు తమిళ భాషల్లో తెరకెక్కుతున్న ఈ బైలింగ్విల్ మూవీతో శ్రీ కార్తిక్ డైరెక్టర్ గా పరిచయం అవుతున్నారు. అప్పుడెప్పుడో షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమా కరోనా కారణంగా ఆలస్యం అయింది. అయితే ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని.. 2022 ఫిబ్రవరిలో విడుదల చేయనున్నట్లు మేకర్స్ ఇటీవలే అధికారికంగా ప్రకటించారు. ఈ నేపథ్యంలో ప్రమోషన్స్ మొదలు పెడుతున్నారు.
ఇందులో భాగంగా తాజాగా 'ఒకే ఒక జీవితం' సినిమాకు సంబంధించిన టీజర్ అప్డేట్ ఇచ్చారు. డిసెంబర్ 28వ తేదీ సాయంత్రం 5 గంటలకు టీజర్ ను రిలీజ్ చేయనున్నట్లు చిత్ర బృందం తెలిపింది. ఈ సందర్భంగా ఓ పోస్టర్ ని వదిలారు. ఇందులో శర్వానంద్ తో పాటుగా హాస్యనటులు వెన్నెల కిషోర్ - ప్రియదర్శి కనిపిస్తున్నారు. ఈ సినిమాలో శర్వా సరసన రీతూ వర్మ హీరోయిన్ గా నటించింది. అక్కినేని అమల కీలక పాత్ర పోషించింది.
సైన్స్ ఫిక్షన్ ఎలిమెంట్స్ తో ఫ్యామిలీ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో.. ఫ్యామిలీ ఆడియన్స్ తో పాటు యూత్ ని ఆకట్టుకునే అంశాలు ఉంటాయని చిత్ర బృందం చెబుతోంది. ఇప్పటికే విడుదలైన ''ఒకే ఒక జీవితం'' ఫస్ట్ లుక్ పోస్టర్ మరియు శర్వానంద్ పాత్రకి సంభందించిన స్నీక్ పీక్ మంచి రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. ఈ క్రమంలో మరో రెండు రోజుల్లో రాబోతున్న టీజర్ ఎలా ఉంటుందో చూడాలి.
డ్రీమ్ వారియర్ పిక్చర్స్ బ్యానర్ పై ఎస్ ఆర్ ప్రకాశ్ బాబు - ఎస్.ఆర్ ప్రభు ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. 'పెళ్లి చూపులు' దర్శకుడు తరుణ్ భాస్కర్ ఈ సినిమాలో డైలాగ్స్ రాయగా.. జేక్స్ బీజోయ్ సంగీతం సమకూరుస్తున్నారు. 'డియర్ కామ్రేడ్' చిత్రానికి వర్క్ చేసిన సినిమాటోగ్రాఫర్ సుజీత్ సారంగ్ - ఎడిటర్ శ్రీ జిత్ సారంగ్ ఈ సినిమాకి పని చేశారు. సరైన సక్సెస్ కోసం వేచి చూస్తున్న శర్వానంద్ కు 'ఒకే ఒక జీవితం' ఎలాంటి హిట్ అందిస్తుందో చూడాలి.