''వెంకటాద్రి ఎక్స్ప్రెస్'' సినిమా తరువాత మరోసారి ఆ రేంజు హిట్‌ను కొట్లేకపోయాడు హీరో సందీప్ కిషన్. ఈసారి కొడితే మైండ్ బ్లాంక్ అయిపోయే రేంజులోనే కొట్టాలి. అందుకే రైటర్ రాజసింహ డైరక్షన్ లో మాంచి కాన్సెప్టు ఉన్న సినిమాను ఎన్నుకున్నాడు. ఆ సినిమా పేరే ''ఒక అమ్మాయి తప్ప''.
ఈ సినిమా ఆడియో రేపు రిలీజ్ అవ్వనున్న తరుణంలో.. మనోడు ఇవాళ ఒక టీజర్ రిలీజ్ చేశాడు. ట్రాఫిక్ లో ఆగిన ఒక ఆటోలో అందమైన క్యూట్ లేడీ నిత్యా మీనన్ కూర్చొని ఉంది. ఆ ప్రక్కనే చలాకీగా బైక్ మీద వచ్చి ఆగాడు ఆకతాయి సందీప్ కిషన్. అయితే ఇందులో ఏముంది అనుకుంటున్నారా? అక్కడే ఉంది. బ్యాగ్రౌండ్ స్కోర్ గా మనోడు ఒకనాటి హారర్ దెయ్యాల సాంగ్.. నిను వీడని నీడను నేనే.. అనే పాటను వాడేశాడు. చూస్తుంటే.. వదలకుండా ఆమె వెంటబడి సందీప్ వేధిస్తున్నాడేమో అన్నట్లుగా ఉంది. గుడ్ టీజర్.
మరో విశేషం ఏంటంటే.. ఈ సినిమాలో దాదాపు 60% కథ ఒక ట్రాఫిక్ జామ్ అయిన ఫ్లయ్ ఓవర్ మీదనే చోటుచేసుకుంటుంది.
Full View