ట్రైల‌ర్ టాక్‌: ల‌వ్వే అనుకోవ‌ద్దు యాక్ష‌న్ కూడా

Update: 2016-05-09 04:29 GMT
ఒక్క అమ్మాయి త‌ప్ప... అనే టైటిల్‌ ని చూస్తే ఎవ‌రికైనా ఏమ‌నిపిస్తుందండీ? ఇదేదో అమ్మాయి వెన‌కాల తిరిగే ఓ అబ్బాయి క‌థ - ప‌క్కా ల‌వ్ స్టోరీ అనే అనుకొంటాం క‌దా! ట్రైల‌ర్ కూడా  మ‌నం అనుకున్న‌ట్టుగానే  మొద‌ల‌వుతుంది. ఆటోలో ఉన్న అమ్మాయి అదేనండీ హీరోయిన్ నిత్య‌మీన‌న్ ద‌గ్గ‌రికి వెళ్లి టీజింగ్ మొద‌లుపెడ‌తాడు అబ్బాయి సందీప్‌కిష‌న్‌. అబ్బాయి పంచ్‌ లు వేయ‌డం - అమ్మాయి సీరియ‌స్ అవ‌డం క‌నిపిస్తుంది. ఇవ‌న్నీ దేనికి సంకేత‌మండీ? ప‌్రేమ‌కే క‌దా! ఆ ప‌క్క‌నే వున్న స‌ప్త‌గిరి అండ్ టీమ్ కూడా  అదే అనుకొని ఆ ఇద్ద‌రి  ల‌వ్‌ స్టోరీని చూస్తూ ఎంజాయ్ చేస్తుంటారు. ఇంత‌లో యాక్ష‌న్ మొద‌ల‌వుతుంది. 

ల‌వ్ స్టోరీ అని ఆశ‌ప‌డితే  యాక్ష‌న్ సినిమా చూపిస్తున్నాడేంటి అని స‌ప్త‌గిరి అండ్ టీమ్ కూడా ఆశ్చ‌ర్య‌పోతుంది. సో... ఒక్క అమ్మాయి త‌ప్ప అని టైటిల్ చూసి కేవ‌లం ల‌వ్‌ స్టోరీ అని మాత్ర‌మే ఫిక్స‌వ‌కండి. సందీప్ రెండు సినిమాలూ చూపించ‌బోతున్నాడు. ఒక‌టి ల‌వ్‌ - మ‌రొక‌టి యాక్ష‌న్.
 
కానీ ట్రైల‌ర్ మాత్రం భ‌లే రిచ్‌ గా వుంది. హైటెక్ సిటీ  ఫ్లైవ‌ర్‌ పై జ‌రిగే క‌థ ఇది. అక్క‌డ రాత్రిపూట స‌న్నివేశాల్ని తెర‌కెక్కించిన‌ట్టున్నారు. ఓ అమ్మాయి - అబ్బాయి ప్రేమ‌క‌థ‌లోకి విల‌న్ ఎలా ఎంట్రీ ఇచ్చాడు? అనే విష‌యం ఆస‌క్తిక‌ర‌మ‌ని అర్థ‌మ‌వుతోంది. రాజ‌సింహ తాడినాడ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన చిత్ర‌మిది. ఇదివ‌ర‌కు ఆయ‌న ప‌లు చిత్రాల‌కి క‌థ‌ - మాట‌లు అందించాడు. నిత్య‌మేన‌న్‌ లాంటి హీరోయిన్ న‌టించిందంటే సినిమాలో విష‌యం ఉండే ఉంటుంది. సినిమాని  ఒక ల‌వ్ థ్రిల్ల‌ర్‌ గా తెర‌కెక్కించిన‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతోంది.
Full View

Tags:    

Similar News