ఫ్లై ఓవర్‌ రొమాన్స్ కి 'యు' ఇచ్చారు

Update: 2016-05-31 11:02 GMT
యంగ్ హీరోల్లో సందీప్ కిషన్ స్పెషల్ క్రేజ్ సంపాదించుకున్నాడు. వరుసగా హిట్స్ కొట్టి గుర్తింపు సంపాదించిన ఈ హీరో.. తర్వాత వరుస ఫ్లాపులతో ఇబ్బంది పడుతున్నాడు. ఇప్పుడు తన కొత్త సినిమాతో ఈ ఫ్లాప్ లకు చెక్ చెప్పాలని భావిస్తున్నాడు. నిత్యా మీనన్ హీరోయిన్ గా నటించిన ఒక అమ్మాయి తప్ప చిత్రంతో సక్సెస్ ట్రాక్ లోకి రావడం ఖాయంగా భావిస్తున్నాడు సందీప్ కిషన్.

ఒక అమ్మాయి తప్ప చిత్రానికి ఇప్పుడు సెన్సార్ పూర్తయింది. సినిమాను ఆద్యంతం ఎంజాయ్ చేసిన బోర్డ్.. మూవీకి 'యు' సర్టిఫికెట్ ఇవ్వడం విశేషం. సినిమా మొత్తం సూపర్బ్ గా వచ్చిందని, నిత్యా మీనన్ నటన ఈ చిత్రానికి ప్రత్యేక ఆకర్షణ అవుతుందనే టాక్ వినిపిస్తోంది. హైటెక్ సిటీ ఫ్లై ఓవర్ ను బేస్ చేసుకుని రాసుకున్న థ్రిల్లింగ్ కాన్సెప్ట్ అదిరిపోయేలా ఉందంటున్నారు.

మొత్తం మూవీ విషయంలో పాజిటివ్ టాక్ వినిపిస్తున్నా.. క్లైమాక్స్ మాత్రం అంత నమ్మశక్యంగా లేదట. ఆ ఎపిసోడ్ ని సూపర్బ్ గా తెరకెక్కించినా.. కన్విన్సింగ్ గా అనిపించలేదనే మాట వినిపిస్తోంది. మొత్తానికి సందీప్ కిషన్ మరోసారి థ్రిల్ చేయబోతున్నాడన్న మాట ఒప్పుకోవాల్సిందే. జూన్ 10న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ మూవీపై.. ఇండస్ట్రీలో మంచి అంచనాలే ఉన్నాయి. ఇప్పుడు సెన్సార్ నుంచి అందుతున్న టాక్ తో ఈ ఎక్స్ పెక్టేషన్స్ మరింతగా పెరిగాయి.
Tags:    

Similar News