మెగాస్టార్‌ ట్వీట్‌ కు స్పందించిన 'ఒలింపిక్స్‌' టీమ్‌

Update: 2021-08-02 23:30 GMT
టోక్యో ఒలింపిక్స్ లో బ్యాడ్మింటన్ లో కాస్యం పతకంను దక్కించుకున్న పీవీ సింధు పై ప్రధాని సహా ఎంతో మంది దిగ్గజాలు ప్రశంసలు కురిపించారు. కాంస్యం దక్కించుకుని వరుసగా రెండవ సారి ఒలింపిక్స్ లో సత్తా చాటిన పీవీ సిందు 140 కోట్ల భారతీయులకు ఆదర్శం అంటూ ఎంతో మంది సోషల్‌ మీడియా ద్వారా అభినందనలు తెలియజేశారు. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు. పీవీ సింధును రెండవ సారి మెడల్ తీసుకు వచ్చినందుకు గాను చిరంజీవి అభినందించాడు. భారత మహిళ శక్తిని నువ్వు చాటి చెప్పావు అంటూ ఆమె పై ప్రశంసలు కురిపించారు. ఈ విజయాలను కొనసాగించాలి.. మహిళలకు మీరు ఆదర్శంగా నిలవాలి.. భారత దేశం గర్వించేలా మీరు చేశారంటూ చిరంజీవి ట్విట్టర్ లో పేర్కొన్నారు.

పీవీ సింధు విజయాన్ని అభినందిస్తూ లక్షల మంది ట్వీట్స్ చేశారు. అయితే ఒలింపిక్స్ అధికారిక ఖాతలో మాత్రం చిరంజీవి ట్వీట్ ను షేర్‌ చేశారు. చిరంజీవి ట్వీట్‌ కు ఒలింపిక్స్ అధికారిక ఖాత నుండి రిప్లై దక్కింది. వాట్ ఆన్‌ ఇన్సిపిరేషన్‌ షి ఈజ్ అంటూ ఇండియా హ్యాష్‌ ట్యాగ్‌ ను ఇండియా ప్లాగ్‌ ను షేర్‌ చేయడం జరిగింది. ఈ ట్వీట్ ను ఇండియన్స్ పెద్ద ఎత్తున షేర్‌ చేస్తున్నారు. ఎంతో మంది ప్రముఖులు ట్వీట్స్ చేసినా కూడా చిరంజీవి ట్వీట్ కు మాత్రమే ఒలింపిక్‌ అధికారిక టీమ్‌ రిప్లై ఇవ్వడం తో మెగా అభిమానులు ఖుషి అవుతున్నారు.

చిరంజీవి అంటే ఎంతో మందికి ఇన్సిపిరేషన్‌. గతంలో పీవీ సింధు పలు సందర్బాల్లో చిరంజీవిని కలవడంతో పాటు ఆయనతో పలు కార్యక్రమాల్లో పాల్గొన్నారు. చిరంజీవి దంపతులు స్వయంగా పీవీ సింధును సత్కరించిన సందర్బం ఉంది. అలాంటి పీవీ సింధు విజయం సాధించి పతకం దక్కించుకున్న నేపథ్యంలో మెగా స్టార్‌ చాలా ఆనందంను వ్యక్తం చేయడం కామన్‌ విషయం. చిరు ట్వీట్‌ లో కేవలం పీ వీ సింధుకు సంబంధించిన విషయం మాత్రమే కాకుండా మీరా బాయి చాను గురించి కూడా ప్రస్థావించాడు. కనుక చిరంజీవి ట్వీట్ కు ఒలింపిక్ టీమ్‌ రిప్లై ఇచ్చారేమో అంటూ కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చిరంజీవి ట్వీట్ కు ఒలిపింక్స్ టీమ్‌ రిప్లై ఇవ్వడం చర్చనీయాంశంగా మారింది.
Tags:    

Similar News