ఎవ్వరూ ఊహించని ఫలితమిది. నెగెటివ్ టాక్ తో మొదలైన సినిమా డిజాస్టర్ అవడం మామూలే. కానీ చాలా మంచి టాక్ వచ్చినా.. దారుణమైన ఫలితాన్ని అందుకుంది ‘ఓం నమో వేంకటేశాయ’. టాలీవుడ్ హిస్టరీలోనే అత్యంత చేదు అనుభవం మిగిల్చిన ఆధ్యాత్మిక చిత్రంగా ‘ఓం నమో వేంకటేశాయ’ నిలిచిపోతుంది. రూ.36 కోట్లు వసూలు చేస్తేనే హిట్ కేటగిరిలోకి చేర్చదగ్గ ఈ సినిమా ఫుల్ రన్లో కేవలం రూ.10 కోట్ల షేర్ తో ఈ సినిమాను నమ్ముకున్న అందరికీ తీవ్ర నిరాశ మిగిల్చింది. దాదాపుగా అన్ని ఏరియాల్లోనూ మూడింట రెండొంతుల నష్టం తప్పలేదు. అమెరికాలో అయితే దాదాపుగా పెట్టుబడి మొత్తం నష్టపోయినట్లే. అక్కడ ఈ చిత్ర హక్కుల్ని రూ.3.5 కోట్లకు కొంటే.. వచ్చిన షేర్ రూ.50 లక్షలు మాత్రమే. అది కూడా పబ్లిసిటీ.. ఇతర ఖర్చులకే సగం పోతుంది. తెలుగు రాష్ట్రాల్లోనూ అన్ని ఏరియాల బయ్యర్లకూ దారుణమైన ఫలితాన్ని మిగిల్చింది ఈ చిత్రం.
ఫుల్ రన్లో ఏరియాల వారీగా ‘ఓం నమో వేంకటేశాయ’ వరల్డ్ వైడ్ షేర్స్ వివరాలు..
నైజాం-రూ.3 కోట్లు
వైజాగ్ (ఉత్తరాంధ్ర)-రూ.95 లక్షలు
సీడెడ్ (రాయలసీమ)-రూ.1.25 కోట్లు
తూర్పు గోదావరి-రూ.60 లక్షలు
పశ్చిమగోదావరి-రూ.50 లక్షలు
గుంటూరు-రూ.80 లక్షలు
కృష్ణా- రూ.50 లక్షలు
నెల్లూరు-రూ.40 లక్షలు
కర్ణాటక-రూ.1.2 కోట్లు
యుఎస్- రూ.50 లక్షలు
మిగతా ఏరియాల్లో- రూ.30 లక్షలు
ఏపీ-తెలంగాణ షేర్- రూ.8 కోట్లు
ఏపీ-తెలంగాణ గ్రాస్- రూ.14.5 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్- రూ.10 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్-20 కోట్లు
ఫుల్ రన్లో ఏరియాల వారీగా ‘ఓం నమో వేంకటేశాయ’ వరల్డ్ వైడ్ షేర్స్ వివరాలు..
నైజాం-రూ.3 కోట్లు
వైజాగ్ (ఉత్తరాంధ్ర)-రూ.95 లక్షలు
సీడెడ్ (రాయలసీమ)-రూ.1.25 కోట్లు
తూర్పు గోదావరి-రూ.60 లక్షలు
పశ్చిమగోదావరి-రూ.50 లక్షలు
గుంటూరు-రూ.80 లక్షలు
కృష్ణా- రూ.50 లక్షలు
నెల్లూరు-రూ.40 లక్షలు
కర్ణాటక-రూ.1.2 కోట్లు
యుఎస్- రూ.50 లక్షలు
మిగతా ఏరియాల్లో- రూ.30 లక్షలు
ఏపీ-తెలంగాణ షేర్- రూ.8 కోట్లు
ఏపీ-తెలంగాణ గ్రాస్- రూ.14.5 కోట్లు
వరల్డ్ వైడ్ షేర్- రూ.10 కోట్లు
వరల్డ్ వైడ్ గ్రాస్-20 కోట్లు