పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాలీవుడ్ లో `ఆదిపురుష్ -3డి` చిత్రంతో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తోన్న సంగతి తెలిసిందే. పురాణేతిహాసాల నేపథ్యంలో అత్యంత భారీ కన్వాస్ పై ఈ చిత్రాన్ని ఓంరౌత్ తెరకెక్కిస్తున్నారు. `రామాయణం` ఆధారంగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో ప్రభాస్ ఆదిపురుష్ రాముడిగా కనిపించనున్నారు. ఇప్పటికే ఆ పాత్రకు సంబంధించి ప్రభాస్ లుక్ ఎలా ఉండబోతుందన్న క్యూరియాసిటీ దేశ వ్యాప్తంగా నెలకొంది. అందులోనూ తెలుగు ప్రేక్షకులకు.. డార్లింగ్ అభిమానులు తమ ఫేవరెట్ స్టన్నింగ్ లుక్ ఎలా ఉంటుందో అంటూ ఒకటే ఊహాగానాలు సాగుతున్నాయి. ఇప్పటికే ఫ్యాన్ మేడ్ పోస్టర్లతోనే సన్నివేశాన్ని హీటెక్కిస్తున్నారు డార్లింగ్ ఫాలోవర్స్. నిజంగా ఆ పోస్టర్లు ఎంతో అద్భుతంగా..క్రియేటివ్ గా ఉన్నాయి.
క్రియేటివ్ డైజనర్ల క్రియేషన్ ని మించిన ట్యాలెంట్ బయటి ప్రపంచంలో ఉందని ఫ్యాన్ మేడ్ పోస్టర్లు చెప్పకనే చెబుతున్నాయి. రకరకాల కారణాలతో `ఆదిపురుష్` లుక్ పై ఒకటే క్యూరియాసిటీ పెరిగిపోతోంది. తాజాగా అన్నిటికీ తెరపడే ఛాన్స్ దగ్గరగానే ఉందని తెలుస్తోంది. ఇప్పటికే చిత్రీకరణ క్లైమాక్స్ కి చేరుకుంది. పాతిక రోజుల షూట్ పెండింగ్. అక్టోబర్ మిడ్ కి మొత్తం షూటింగ్ పూర్తవుతుంది. సరిగ్గా ప్రభాస్ బర్త్ డే కూడా అక్టోబర్ 23 లేదా ఆలోపు షూటింగ్ పూర్తవుతుంది. ఆదిపురుష్ యూనిట్ పూర్తిగా ఫ్రీ అవుతుంది. అప్పటి నుంచి పోస్ట్ ప్రొడక్షన్ పనులపై టీమ్ నిమగ్నం కానుంది. ఈ నేపథ్యంలో డార్లింగ్ పుట్టిన రోజు సందర్భంగా `ఆదిపురుష్ 3డి` ఫస్ట్ లుక్ పోస్టర్ ని ఆ రోజు రిలీజ్ చేసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయన్న టాక్ వినిపిస్తోంది.
చిత్రీకరణ కూడా పూర్తయిపోతోంది కాబట్టి ప్రభాస్ ఫ్యాన్స్ కి బర్త్ డే కానుకగా ఫస్ట్ లుక్ పోస్టర్ తో ట్రీట్ ఇవ్వనున్నారని సంకేతాలు బలంగా అందుతున్నాయి. అలాగే సలార్...రాధేశ్యామ్ చిత్రాలకు సంబంధించిన పోస్టర్ల జోరు కూడా ఆ రోజు కనిపించే అవకాశం ఉంది. అదే జరిగితే ఫ్యాన్స్ కి డబుల్ కాదు ట్రిపుల్ ట్రీట్ అందుతున్నట్టే. ప్రభాస్ కి శుభాకాంక్షల చెప్పడానికి విదేశీ అభిమానులే ఆయన ఇంటి ముందు క్యూ కట్టేస్తుంటారు. హైదరాబాద్ లో నివశించే జపాన్..చైనా...థైవాన్ అభిమానులు బాహుబలి రిలీజ్ తర్వాత ఇలాంటి సన్నివేశాన్నే డార్లింగ్ ఇంటి ముందు చూపించారు. ఇప్పుడు డార్లింగ్ క్రేజ్ మూడింతలైంది. కాబట్టి ఈసారి ఆ క్యూ మరింత పెద్దదిగానే ఉంటుందనడంలో సందేహమే లేదు. ఇక తెలుగు అభిమానుల నీరాజనాల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆ స్పెషల్ డే రోజున ఊరు..వాడ..పల్లె పట్టణం అనే తేడా లేకుండా ప్రభాస్ భారీ కటౌట్లు దర్శనమిస్తాయి. భీమవరంలో కిలోమీటర్ల పొడవునా ప్రభాస్ కటౌట్లు వాల్ పోస్టర్లతో రికార్డులు బ్రేక్ చేయడం ఖాయం.
WAR దర్శకుడితో ఆ రోజు ప్రకటిస్తారా?
బ్యాంగ్ బ్యాంగ్ - WAR లాంటి భారీ చిత్రాలతో యాక్షన్ చిత్రాల దర్శకుడిగా ప్రత్యేక ముద్ర వేశాడు సిద్ధార్థ్ ఆనంద్. అతడు చాలా కాలంగా సౌతిండియా స్టార్ ప్రభాస్ తో సినిమా చేసేందుకు మంతనాలు సాగిస్తున్నారని కథనాలొచ్చాయి. అయితే ప్రభాస్ ఈ ప్రాజెక్ట్ ని ఖాయం చేసుకున్నారా లేదా? అన్నదానిపై ఎలాంటి క్లారిటీ లేదు. ఈ సినిమాని నిర్మించే మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నుంచి ఎలాంటి అధికారిక కన్ఫర్మేషన్ లేదు. ఆదిపురుష్ తర్వాత ప్రభాస్ నటించే రెండవ హిందీ ప్రాజెక్ట్ సిద్ధార్థ్ ఆనంద్ తోనే ఉంటుందని బలంగా కథనాలొచ్చాయి. ఇటీవల ప్రభాస్ - సిద్ధార్థ్ నడుమ పలుదఫాలుగా చర్చలు సమావేశాలు పూర్తయ్యాయి. ఇక ప్రాజెక్ట్ ఖాయమైనట్టేనని అంతా భావించారు. తాజా సమాచారం మేరకు ప్రభాస్ 24 కోసం రంగం సిద్ధం చేయనున్నారని గుసగుసలు వినిపిస్తున్నాయి. సిద్ధార్థ్ ఆనంద్ తో ప్రభాస్ ప్రాజెక్ట్ ప్రకటన సెప్టెంబర్ లో ఉంటుందని కథనాలొచ్చినా ఇంతవరకూ లేదు. అంటే కచ్ఛితంగా ప్రభాస్ బర్త్ డే రోజున ఈ సినిమాని ప్రకటించే వీలుంటుంది. అంటే ట్రిపుల్ ట్రీట్ కాదు అంతకుమించి అనేలా ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు.